ఈ బాంబు వేస్తే అంతే.. పాక్‌పై మరో ఎయిర్ స్ట్రైక్ దిశగా మోదీ..!

భారత్ పాకిస్థాన్‌పై మరో ఎయిర్ స్ట్రైక్‌కు సిద్ధమవుతుందా.. తరచూ పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలకు చెక్ పెట్టాలని చూస్తుందా.. లేదా.. వచ్చే నెలలో యుద్ధం చేస్తామని పాక్ ప్రకటనతో ముందస్తు జాగ్రత్తలు పడుతుందా.. ఒకవేళ యుద్ధం వస్తే.. పాక్‌కు గట్టి గుణపాఠం చెప్పేందుకు సన్నద్దమవుతుందా..? అంటే అవుననే తెలుస్తోంది. తాజాగా భారత ఆయుధ సంపత్తి పెరుగుతోంది. తాజాగా భారత అమ్ములపొదిలోకి చేరిన బాంబులు చూస్తే.. పాక్ ఏ మాత్రం తొకాడించినా.. మరో ఎయిర్ స్ట్రైక్ చేసేందుకు భారత్ […]

ఈ బాంబు వేస్తే అంతే.. పాక్‌పై మరో ఎయిర్ స్ట్రైక్ దిశగా మోదీ..!
Follow us

| Edited By:

Updated on: Sep 17, 2019 | 6:24 AM

భారత్ పాకిస్థాన్‌పై మరో ఎయిర్ స్ట్రైక్‌కు సిద్ధమవుతుందా.. తరచూ పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలకు చెక్ పెట్టాలని చూస్తుందా.. లేదా.. వచ్చే నెలలో యుద్ధం చేస్తామని పాక్ ప్రకటనతో ముందస్తు జాగ్రత్తలు పడుతుందా.. ఒకవేళ యుద్ధం వస్తే.. పాక్‌కు గట్టి గుణపాఠం చెప్పేందుకు సన్నద్దమవుతుందా..? అంటే అవుననే తెలుస్తోంది. తాజాగా భారత ఆయుధ సంపత్తి పెరుగుతోంది. తాజాగా భారత అమ్ములపొదిలోకి చేరిన బాంబులు చూస్తే.. పాక్ ఏ మాత్రం తొకాడించినా.. మరో ఎయిర్ స్ట్రైక్ చేసేందుకు భారత్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

పుల్వామా దాడి అనంతరం మోదీ ప్రభుత్వం బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ చేపట్టారు. అందులో దాదాపు 300 మంది ఉగ్రవాదులు మరణించారని భారత ప్రభుత్వం వెల్లడించింది. అయితే అప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయం కావడంతో.. ఎయిర్‌ స్ట్రైక్‌లో ఎవరు చనిపోలేదని.. అటు పాక్ వల్లిస్తుంటే.. కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా అలానే ఆరోపించాయి. అయితే తాజాగా జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగిస్తూ.. ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో పాక్, భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత్ మరోసారి బాలాకోట్ లాంటి దాడులకు పాల్పడబోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని చూస్తుంటే.. బాలాకోట్ ఉగ్రస్థావరాలపై జరిగిన దాడుల్లో ఉగ్రవాదులు హతమయ్యారని స్పష్టం అవుతోంది.

అయితే రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోదీ.. దేశ ఆయుధ సంపత్తిని వృద్ధి చేసే పనిలో భాగంగా.. జూన్ మాసంలో ఇజ్రాయిల్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అత్యంత శక్తివంతమైన స్పైస్-2000 బాంబులను ఆర్డర్ చేశారు. మొత్తం వంద స్పైస్-2000 బాంబులను కొనుగోలు చేసేందుకు భారత వైమానిక దళం రూ.300కోట్లతో డీల్ కుదుర్చుకుంది. ఈ బాంబులు ప్రస్తుతం భారత్ చేరుకున్నాయి. ఒప్పందంలో భాగంగా మొదటి విడత స్పైస్- 2000 బాంబులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లోని వైమానిక కేంద్రానికి వచ్చాయి. ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ నుంచి మరిన్ని బాంబులు రానున్నాయి.

అయితే ఈ బాంబులనే బాలాకోట్‌ ఉగ్రస్థావరాలపై ప్రయోగించింది. అయితే తాజాగా చేరిన స్పైస్-2000 మరింత శక్తివంతమైనవి. ఇవి పెద్ద పెద్ద బిల్డింగ్‌లను సైతం సులభంగా నేలమట్టం చేయగలవు. భారత్ తో యుద్ధం చేస్తాం అంటూ కవ్వింపు చర్యలకు పాల్పుడుతన్న పాక్‌కు.. స్పైస్-2000 ఆయుధాలు భారత్‌కు చేరాయన్న వార్త మింగుడుపడటం లేదు.

అయితే ఈ బాంబులను ప్రయోగించే సామర్థ్యం ఉన్న మిరాజ్ -2000 యుద్ధ విమానాలు గ్వాలియర్‌లో వైమానిక స్థావరంలో ఉన్నాయి. దీంతో ఈ స్పైస్-2000 బాంబులను కూడా అక్కడికే తరలించారు. ఇక వచ్చే నెలలోనే భారత్ చేతికి రాఫేల్ యుద్ధ విమానాలు కూడా రాబోతున్నాయి. అయితే అవి పూర్తిగా మన దేశానికి చేరడానికి మరో ఆరు నెలలు పడుతుంది. కానీ యుద్ధం అనేదే జరిగితే.. తక్షణమే వాటిని రప్పించే అవకాశం కూడా లేకపోలేదు. ఏదేమైనా ప్రస్తుతం స్పైస్-2000 బాంబులు భారత్ అమ్ములపొదిలోకి చేరడం.. పాక్‌కు భారీ షాక్ తగిలినట్లైంది.