186 కోట్ల అప్పు.. అజ్ఞాతంలోకి నిర్మాత.. ఆయనెవరంటే.?

సినిమా హిట్టయినా.. ప్లాప్ అయినా.. నిర్మాతలకు ఏదో ఒక రూపంలో చుక్కలు కనిపిస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడూ వసూళ్లు పరంగా దెబ్బపడుతూనే ఉంటుంది. ఒక సినిమా ప్లాప్ అయితే.. మరో చోట నుంచి డబ్బులు తెచ్చుకుని ఎలాగైనా హిట్ సాధించాలని చూసే నిర్మాతలు ఎందరో ఉన్నారు. సరిగ్గా ఇలాగే ఓ నిర్మాత కూడా ప్రయత్నం చేసి.. విపరీతమైన నష్టాలు పాలవ్వడంతో ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇక ఆ నిర్మాత ఎవరో కాదు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేత […]

186 కోట్ల అప్పు.. అజ్ఞాతంలోకి నిర్మాత.. ఆయనెవరంటే.?
Follow us

|

Updated on: Sep 29, 2019 | 8:18 PM

సినిమా హిట్టయినా.. ప్లాప్ అయినా.. నిర్మాతలకు ఏదో ఒక రూపంలో చుక్కలు కనిపిస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడూ వసూళ్లు పరంగా దెబ్బపడుతూనే ఉంటుంది. ఒక సినిమా ప్లాప్ అయితే.. మరో చోట నుంచి డబ్బులు తెచ్చుకుని ఎలాగైనా హిట్ సాధించాలని చూసే నిర్మాతలు ఎందరో ఉన్నారు. సరిగ్గా ఇలాగే ఓ నిర్మాత కూడా ప్రయత్నం చేసి.. విపరీతమైన నష్టాలు పాలవ్వడంతో ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇక ఆ నిర్మాత ఎవరో కాదు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరణ్.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘2.0’ లాంటి భారీ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ గత కొంతకాలంగా ఆర్ధిక నష్టాల్లో ఉందని తెలుస్తోంది. దీనితో అప్పులు ఇచ్చిన వారు, ఫైనాన్షియర్లు ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇందువల్లే ‘భారతీయుడు 2’ చిత్రం రకరకాల ఇబ్బందులకు గురయ్యి షూటింగ్ ఆలస్యం అవుతోందని సమాచారం.

ఇటీవల ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్ రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే మరోసారి ఈ సినిమాకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. లైకా అధినేత సుభాస్కరణ్ 186 కోట్ల అప్పులతో ఒత్తిడికి గురవుతున్నారని..  అందుకే కొద్దిరోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఫైనాన్షియర్లు సుభాస్కరణ్ రూ.186 కోట్లకు మోసం చేసి పరారయ్యారని ఆరోపిస్తూ.. ఈ మేరకు చెన్నై పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేయనున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దాదాపు 500 కోట్లతో 2.0 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. కొన్ని చోట్ల ఫైనాన్షియర్లుకు నష్టాలొచ్చాయి. వాటిని భర్తీ చేయడానికి రీసెంట్‌గా చైనాలో విడుదల చేశారు. ఇక అక్కడ కూడా ఆశించిన స్థాయి కలెక్షన్స్ సాధించలేదు. దీనితో సుభాస్కరణ్‌కు ఒత్తిళ్లు ఎదురయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మిస్తున్న రెండు చిత్రాలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. రెండు(దర్బార్, భారతీయుడు 2) కూడా బడా చిత్రాలు కావడంతో ఆర్ధిక సమస్యలు తప్పకపోవచ్చనని అంచనా వేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై లైకా ప్రొడక్షన్స్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.?