అధిష్టానం ఆ నిర్ణయం వెనుక అసలు స్కెచ్ అదేనా..?

మొన్న జరిగిన తెలంగాణ కేబినెట్ విస్తరణ తర్వాత ఆశావహుల నుంచి అసంతృప్తి వెల్లడైన విషయం తెలిసిందే. అయితే ఈ కేబినెట్ విస్తరణలో భాగంగా ఇద్దరికి మంత్రి పదవులు పోతాయంటూ వార్తలు వచ్చాయి. అందులో ముఖ్యంగా మంత్రి ఈటెల పేరు ప్రధానంగా వార్తల్లో నిలిచింది. అయితే ఎవరికి ఉద్వాసన పలకకుండా కేబినెట్ విస్తరణ సజావుగా అయ్యింది. అయితే ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. మరోసారి ఈటెలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి హోదా ఉన్నా.. ఆయన […]

అధిష్టానం ఆ నిర్ణయం వెనుక అసలు స్కెచ్ అదేనా..?
Follow us

| Edited By:

Updated on: Sep 13, 2019 | 12:58 PM

మొన్న జరిగిన తెలంగాణ కేబినెట్ విస్తరణ తర్వాత ఆశావహుల నుంచి అసంతృప్తి వెల్లడైన విషయం తెలిసిందే. అయితే ఈ కేబినెట్ విస్తరణలో భాగంగా ఇద్దరికి మంత్రి పదవులు పోతాయంటూ వార్తలు వచ్చాయి. అందులో ముఖ్యంగా మంత్రి ఈటెల పేరు ప్రధానంగా వార్తల్లో నిలిచింది. అయితే ఎవరికి ఉద్వాసన పలకకుండా కేబినెట్ విస్తరణ సజావుగా అయ్యింది. అయితే ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. మరోసారి ఈటెలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి హోదా ఉన్నా.. ఆయన ప్రాధాన్యతను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఓ వైపు మంత్రి వర్గంలో కొనసాగిస్తూనే.. అతనికి పవర్స్‌ తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కావాలనే ఇలా చేస్తున్నారన్న చర్చ ప్రస్తుతం మొదలైంది. ముందుగా కేబినెట్ విస్తరణ‌ తర్వాత భవిష్యత్ ఏంటన్న చర్చలు కొనసాగిన విషయం తెలిసిందే. మంత్రి పదవికి పార్టీ ఉద్వాసన పలికితే పార్టీ మారతారంటూ కూడా వార్తలు వచ్చాయి. మంత్రి పదవి పోతుందన్న వార్తలు షికార్లు చేస్తుండటంతో.. ఆ సమయంలో ఈటెల ఆయన స్వరం పెంచారు. పార్టీ ప్రారంభం నుంచి ఉన్నామని.. పార్టీకి ఓనర్లం కూడా మేమేనని వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌ అయ్యాయి. ఆ తర్వాత ఈటెలకు తోడుగా రసమయి కూడా ధిక్కార స్వరం వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత తమ నాయకుడు కేసీఆరే అని తెలిపారు. అయితే ఈ తతంగానికి ఫు‌ల్ స్టాప్ పెట్టేలా.. కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రి పదవి అలానే ఉంచింది. దీంతో ఈ చర్చకు బ్రేక్ పడిందనుకున్నారు అంతా. అయితే కేబినెట్ విస్తరణ పూర్తయి.. మంత్రుల ప్రమాణస్వీకారం అయిన 24 గంటలు గడవకముందే.. ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

మంత్రి వర్గ విస్తరణ, ప్రమాణ స్వీకారం అయిన.. ఆ మరుసటి రోజే బడ్జెట్ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే ఈటెల ప్రాతినిధ్యం తగ్గించే పనికి శ్రీకారం చుట్టినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందులో భాగంగా అసెంబ్లీ వ్యవహారాల్లొ ఈటల రాజేందర్ ప్రాధాన్యతను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా ఉన్న ఈటెలను తొలగించాలని కోరుతూ టిఆర్ఎస్ అధిష్టానం స్పీకర్‌కు లేఖ రాసింది. ఈటెల రాజేందర్ స్థానంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను నియమించాలని కోరింది. దీంతో ఈటెల ప్రాతినిధ్యం తగ్గించే పక్రియ చాపకింద నీరులా సాగుతుందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, ఈటెల రాజేందర్ విషయంలో అసలు ఏం జరుగుతుంది.. అసలు అధిష్టానం ఏం ఆలోచిస్తుందన్న దానిపై ఆయన వర్గం మల్లగుల్లాలు పడుతోంది. ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో కలిసి పోరాటం చేసిన ఈటెల రాజేందర్.. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమైందన్న చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. అధినేత కేసీఆర్‌, ఈటెల మధ్య దూరం పెరిగిందన్న అభిప్రాయం ఉంది. అయితే అధిష్టానం మొన్న బడ్జెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం వెనుక అసలు స్కెచ్ ఎంటి అన్నది  తేలాల్సి ఉంది. నిజంగానే మంత్రి ఈటెల ప్రాధాన్యత తగ్గిస్తూ.. మంత్రి పదవికి ఉద్వాసన పలుకుతారా..? లేక.. మంత్రి పదవితో పాటు.. మరేదైనా బాధ్యత అప్పగిస్తారా.. ? అన్నది తేలాల్సి ఉంది.