మధుమేహానికి, ఖర్జూరానికి లింకు.. రీసెర్చర్లు ఏం చెప్తున్నారంటే..!

Is it Ok for a diabetic to eat dates?, మధుమేహానికి, ఖర్జూరానికి లింకు.. రీసెర్చర్లు ఏం చెప్తున్నారంటే..!

ఖర్జూరాలు.. శరీరానికి తక్షణ శక్తినిచ్చే పండ్లలో ఇది అతి ముఖ్యమైనది. ఇందులో అనేక రకాలైన పోషక విలువలు ఉన్నాయి. అందుకే దీన్ని ‘ప్రోటీన్స్‌ పవర్‌ హౌస్‌’ అని కూడా పిలుస్తుంటారు. అందుకే మనం తినే ఆహారంలో ఖర్జూరాలు ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఎందుకంటే వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకదాు సహజమైన షుగర్ ఉంటుంది. వీటిలో సెలెనియం, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం కూడా అధికంగా ఉంటాయి. అయితే ఈ ఖర్జూరాలను డయాబెటిస్ ఉన్నవారు మాత్రం ఎక్కువగా తినవద్దని చెబుతుంటారు. సాధారణంగా మధుమేహం ఉన్నవారు.. ఎక్కువ షుగర్, ఎక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తినవద్దని అంటుంటారు. మరి వీళ్లు అధిక ప్రోటీన్స్ ఉండే.. ఖర్జూరాలను తినవచ్చా.. తింటే ఎలాంటి వారు తినాలి? అన్న దానిపై 2011లో ఓ పరిశోధన జరిగింది.

Is it Ok for a diabetic to eat dates?, మధుమేహానికి, ఖర్జూరానికి లింకు.. రీసెర్చర్లు ఏం చెప్తున్నారంటే..!

ఈ పరిశోధనలో పలు రకాల ఖర్జూరాలపై పరిశోధనలు జరిపి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ పరిశోధన ప్రకారం.. ఖర్జూరాలలో గ్లిసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని తేలింది. మొత్తం ఐదు రకాల ఖర్జూరాలు.. ఫరాద్, లులు, బొమాన్, డబ్బాస్, ఖలాస్‌పై రీసెర్చ్ చేశారు. వీటిలో గ్లిసెమిక్ ఇండెక్స్, బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై గ్లిసెమిక్ ఇండెక్స్ ప్రభావం, టైప్ 2 డయాబెటిస్‌పై వాటి ప్రభావం ఎంత ఉంటుందో తెలుసుకున్నారు. గ్లిసెమిక్ ఇండెక్స్ 46 నుంచీ 55 ఉంటే… అవి ఆరోగ్యకరమైన ఖర్జూరాలనీ, గ్లిసెమిక్ ఇండెక్స్ 43 నుంచీ 53 మధ్య ఉంటే.. అవి టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి అనుకూలమైనవిగా తేల్చారు.

Is it Ok for a diabetic to eat dates?, మధుమేహానికి, ఖర్జూరానికి లింకు.. రీసెర్చర్లు ఏం చెప్తున్నారంటే..!

వీటిలో ఉండే సెలెనియం మనిషిలోని ఒత్తిడిని తగ్గిస్తుందని తేలింది. అయితే ఒత్తిడి వల్లే డయాబెటిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. అంతేకాదు ఈ ఒత్తిడి వల్ల ఎముకలు పెళుసుబారడం, కాన్సర్, అల్జీమర్స్ వంటివి కూడా వస్తాయి. హైపర్ టెన్షన్‌తో బాధపడేవారికి… ఖర్జూరాల్లోని పొటాషియం, తక్కువ స్థాయి సోడియం మేలు చేస్తాయని.. వీటిలోని ఫైటోకెమికల్స్… కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయని తేలింది. అంతేకాదు గుండె జబ్బులు, కాన్సర్‌ను కూడా దూరం చేస్తాయి.

Is it Ok for a diabetic to eat dates?, మధుమేహానికి, ఖర్జూరానికి లింకు.. రీసెర్చర్లు ఏం చెప్తున్నారంటే..!

అయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండి.. నిత్యం వ్యాయామం చేసే వారు రోజుకు ఒకటి నుంచి మూడు ఖర్జూరాలు తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో తొలుత వైద్యుడి సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. మిగతా పండ్లకీ.. ఖర్జూరాలకీ కొంత తేడా ఉంది. ఖర్జూరాలు ఎండినట్లు ఉంటాయి కాబట్టి… వాటిలో నీరు లేకుండా… పూర్తిగా కేలరీలే ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ఈ కారణం చేత ఖర్జూరాలు తినగానే.. ఎనర్జీ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది మధుమేహం(డయాబెటిస్ పేషెంట్లు) ఉన్న వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల వైద్యుడి సలహా తీసుకున్న తర్వాతే ఖర్జూరాలు తీసుకోవడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *