Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

ఐపీఎల్‌తో ధోని కెరీర్ ముగిసినట్లేనా.?

Dhoni Retirement Will Be After IPL 2020, ఐపీఎల్‌తో ధోని కెరీర్ ముగిసినట్లేనా.?

జట్టులో అతడొక మాస్టర్ మైండ్.. వికెట్ల వెనుక ఉంటూ బ్యాట్స్‌మెన్‌ను చాకచక్యంగా స్టంపింగ్ చేయడమే కాకుండా బౌలర్లకు కావాల్సిన సలహాలిస్తూ సరైన సమయంలో వికెట్లు పడేలా ప్రణాళికలు రచిస్తాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా.. విజయానికి దగ్గరగా ఉన్నా.. అతడు ఎంతో కూల్‌గా ఉంటూ చిరునవ్వు చిందిస్తాడు. మీకు ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది.. ఎవరి గురించి చెబుతున్నానోనని.. అదేనండీ మన మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని.

సౌరవ్ గంగూలీ అనంతరం టీమిండియా పగ్గాలు చేపట్టిన ధోని ఎన్నో అద్భుత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ప్రపంచమేటి బ్యాట్స్‌మెన్‌గా అవతరించడంలో ధోని పాత్ర ఎంతైనా ఉంది. ఒక్క కోహ్లీ మాత్రమే కాదు.. బౌలర్లకు దిశానిర్దేశాలు ఇవ్వడంలో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా విజయతీరాలు చేర్చడంలో ధోని దిట్ట. అలాంటి మహేంద్రుడు కొద్దికాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు.

వన్డే వరల్డ్ కప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా ధోని.. ఎప్పుడు రీ- ఎంట్రీ ఇస్తాడన్న దానిపై క్లారిటీ లేదు. ప్రపంచకప్‌లో టాప్ ఆర్డర్ విఫలమైనా.. ధోని చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. అయితే అనూహ్యంగా రనౌట్ కావడంతో భారత్ మెగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇక ఆ తర్వాత రెండు నెలలు ఆర్మీలో సేవ చేసిన ధోని.. తాజాగా జరిగిన వెస్టిండీస్ సిరీస్, త్వరలో జరగబోయే శ్రీలంక సిరీస్‌లకు ఎంపిక కాలేదు.

అతడి రిటైర్మెంట్‌పై ఎన్నో కథనాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నా.. అభిమానులకు మాత్రం ఆయన తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తాడన్న ఆశ మాత్రం ఉంది. తాజాగా ధోని కూడా ఓ ఇంటర్వ్యూలో జనవరి వరకు తాను ఏం చెప్పలేనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

త్వరలో జరగబోయే ఐపీఎల్‌లో ధోని ఫామ్‌ను బట్టి అతడు జట్టుతో కొనసాగుతాడా.. లేదా అనే దానిపై అటు బీసీసీఐ, ఇటు సెలెక్టర్లు తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్‌లో ఆస్ట్రేలియాలో మొదలయ్యే టీ20 వరల్డ్‌కప్‌కు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను సిద్ధం చేస్తోందని సమాచారం.