అంతరిక్షంలోకి కరోనా వెళ్తుందా…? నాసా ఏం చెప్తుందంటే..?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోఆ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చైనాలో పురుడు పోసుకున్న ఈ వైరస్.. దాదాపు అన్ని దేశాలను ముట్టేసింది. మరి ఈ మహమ్మారి రోదసిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని కూడా తాకుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) స్పందించింది. కరోనా మహమ్మారి రోదసిలోని ఐఎస్ఎస్‌లోకి ఎంటర్‌ అయ్యే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఎందుకంటే.. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేముందు.. కొద్దిరోజుల పాటు వారిని క్వారంటైన్‌లో ఉంచుతామని.. నాసాలో వైద్య […]

అంతరిక్షంలోకి కరోనా వెళ్తుందా...? నాసా ఏం చెప్తుందంటే..?
Follow us

| Edited By:

Updated on: Apr 01, 2020 | 3:19 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోఆ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చైనాలో పురుడు పోసుకున్న ఈ వైరస్.. దాదాపు అన్ని దేశాలను ముట్టేసింది. మరి ఈ మహమ్మారి రోదసిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని కూడా తాకుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) స్పందించింది. కరోనా మహమ్మారి రోదసిలోని ఐఎస్ఎస్‌లోకి ఎంటర్‌ అయ్యే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఎందుకంటే.. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేముందు.. కొద్దిరోజుల పాటు వారిని క్వారంటైన్‌లో ఉంచుతామని.. నాసాలో వైద్య సహాయకురాలు రక్సానా బాత్సమనోవా తెలిపారు. అంతేకాదు.. రోదసిలోకి పంపే వస్తువులలో క్రిములు లేకుండా చేస్తామన్నారు.