లూసిఫ‌ర్ రీమేక్..మెగాస్టార్ కి సుజిత్ స్క్రిప్ట్ న‌చ్చ‌లేదా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జంట్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో 'ఆచార్య' సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ త‌ర్వాత‌ మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ చిత్రం 'లూసిఫ‌ర్' రీమేక్‌లో న‌టించ‌నున్నారు.

లూసిఫ‌ర్ రీమేక్..మెగాస్టార్ కి సుజిత్ స్క్రిప్ట్ న‌చ్చ‌లేదా..?
Follow us

|

Updated on: Jul 15, 2020 | 10:56 AM

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జంట్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ త‌ర్వాత‌ మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ చిత్రం ‘లూసిఫ‌ర్’ రీమేక్‌లో న‌టించ‌నున్నారు. ఈ సినిమా ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ కి అప్ప‌గించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతోంది. సుజిత్ డెవ‌ల‌ప్ చేసిన స్క్రిప్ట్ చిరూకి పెద్ద‌గా రుచించ‌లేదట‌‌. భారీ ప్రాజెక్ట్ కావ‌డంతో సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కి ఆ ప్రాజెక్ట్ అప్ప‌గించండానికి స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్టు తెల‌స్తోంది.

ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్ డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. చిరంజీవికి ‘ఠాగూర్’, ‘ఖైదీ నంబ‌ర్ 150’ లాంటి బ్లాక్ బాస్ట‌ర్ సినిమాలు అందించాడు వినాయ‌క్. పైగా చిరంజీవికి పెద్ద అభిమాని కూడా. ఈ క్ర‌మంలో లూసిఫ‌ర్ రిమేక్ బాధ్య‌తలు కూడా ఈ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ చేతికి అప్ప‌గించాల‌ని మెగా యూనిట్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యంపై త్వ‌ర‌లోనే ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.