యూటర్న్ తీసుకున్న గంటా.. చిరునే కారణమా..!

Ganta Srinivasa Rao takes U turn, యూటర్న్ తీసుకున్న గంటా.. చిరునే కారణమా..!

మాజీ మంత్రి గంటా అధినేతకు షాక్ ఇవ్వనున్నాడా..? టీడీపీని వీడనున్న గంటా..? వైసీపీలోకి గంటా చేరికకు గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోనున్న గంటా.. ఇలా మొన్నటివరకు రకరకాలుగా వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలన్నింటికి తాజాగా చెక్ పెట్టారు ఆయన. ఇన్ని రోజులు పార్టీ కార్యాలయం వైపు చూడకుండా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన గంటా.. ఇవాళ ఉన్నట్లుండి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి వెళ్లారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై ఆయన చర్చించారు. దీంతో ఇన్నిరోజులుగా వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పడ్డట్లు అయ్యింది. అయితే సడన్‌గా ఆయన యూటర్న్ తీసుకోవడానికి కారణమేమై ఉంటుంది..? అన్న చర్చ రాజకీయాల్లో జరుగుతోంది.

కాగా ఈ మధ్యన చిరంజీవితో రెండు మూడు సార్లు కలిసి కనిపించారు గంటా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా చిరుతో తన రాజకీయ భవితవ్యంపై గంటా చర్చించినట్లు సమాచారం. ఏపీలో ప్రస్తుతం టీడీపీకి గడ్డు పరిస్థితి ఉన్నప్పటికీ.. పార్టీ మార్పు వద్దని గంటాకు చిరు సూచించినట్లు తెలుస్తోంది. దీంతోనే గంటా వెనక్కి తగ్గాడని సమాచారం. మరోవైపు వైసీపీలో చేరేందుకు అధిష్టానం నుంచి గంటాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ.. ఆయన ఆ పార్టీలో చేరాలంటే జగన్ రూల్స్ ప్రకారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు గంటా సిద్ధంగా లేడట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలు ఖరారరయ్యాయి. ఈ నెల 10, 11న విశాఖ జిల్లా, 21, 22న శ్రీకాకుళం జిల్లాలో బాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జరిగే సమీక్షకు గంటా కూడా హాజరవుతారని.. అందుకే నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరవుతారని స్థానిక టీడీపీ నేతలు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *