Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

‘రొమాంటిక్‌ సీన్లు’.. చిరంజీవికి తలనొప్పిగా మారాయా..?

Is Chiranjeevi not comfortable with romantic scenes in his films?, ‘రొమాంటిక్‌ సీన్లు’.. చిరంజీవికి తలనొప్పిగా మారాయా..?

మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. రాజకీయాల వల్ల ఆయన సినిమాలకి దూరంగా ఉన్నారు కానీ.. ఆయన సినిమా వస్తే.. అభిమానులకు ఎంత పండుగో.. తాజాగా రిలీజ్‌ అయిన ‘సైరా నరసింహా రెడ్డి’తో‌ రుజువైంది. చాలా రోజుల తర్వాత చిరంజీవి థియేటర్‌పై కనిపించడంతో.. ఫ్యాన్స్ సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి. మోగాస్టార్ ఈజ్‌ బ్యాక్.. అంటూ చిరు కటౌట్‌లకు పాలాభిషేకాలు చేసి భారీ పూల దండలు వేసి బ్రహ్మరథం పట్టారు అభిమానులు. అంతేకాకుండా.. సైరా చిత్రం కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసి కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించింది. పలు భాషల్లో రిలీజ్‌ అయిన ఈ సినిమా.. చిరు కెరీర్‌లో మరో బ్లాక్‌ బస్టర్ హిట్‌గా నిలిచింది.

దీంతో.. ఇప్పుడు చిరంజీవి వరుస పెట్టి సినిమాలకు సంతకాలు చేసేశారు. ఒకరి తర్వాత మరొక డైరెక్టర్ చిరుతో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు మెగాస్టార్ పక్కన.. ఆడిపాడేందుకు మాత్రం హీరోయిన్ దొరకడం కష్టంగా మారిందట. ‘స్టాలిన్’ సినిమాలో త్రిషతో నటించినప్పుడే చాలా విమర్శలు వినిపించాయి. ఇప్పుడు మళ్లీ సైరా సినిమాలో తనకంటే సగం వయసున్న హీరోయిన్లతో కలిసి నటిస్తున్నారు చిరు.

Is Chiranjeevi not comfortable with romantic scenes in his films?, ‘రొమాంటిక్‌ సీన్లు’.. చిరంజీవికి తలనొప్పిగా మారాయా..?

ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లతో.. రొమాంటిక్ సీన్స్ చేయడానికి చిరుకి కాస్త ఇబ్బందిగా ఉందని అనిపిస్తోంది. అందులోనూ అటువంటి సీన్స్‌ తెరపై చూడటం కూడా.. ఫ్యాన్స్‌కు ఎబ్బెట్టుగా ఉందట. తాజాగా.. చిరు నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమాలోనూ ఇదే జరిగింది. చిరు సరసన ఇద్దరు హీరోయిన్లు.. తమన్నా, నయన తార నటించారు. నయన్.. చిరు పక్కన కాస్త బెటర్ అనిపించింది. కానీ.. తమన్నా మాత్రం అస్సలు సూట్ కాలేదు. తెరపై చిరు, తమన్నా.. కాంబినేషన్ చూడటం కాస్త ఇబ్బందిగానే అనిపించిందని ఫ్యాన్స్ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

అయితే.. సినిమాలో హీరోయిన్స్‌తో.. హీరోకి.. ఆట పాటలు కంపల్సరీగా ఉండాలి. సైరా సినిమాకి పాటలు అవసరం లేదు కాబట్టి.. ఓకే.. కానీ ఇప్పుడు చిరు వచ్చే సినిమాలకు ఖచ్చితంగా కావాలి. దీంతో కొరటాల తన సినిమాలో.. చిరంజీవి ప్లేస్‌లో రాంచరణ్‌ పెట్టి.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో సాంగ్స్ పెట్టి.. మిగతావి.. చిరంజీవితో కానిస్తారని సమాచారం. కానీ.. అన్ని సినిమాలకు ఈ స్ట్రాటజీ వర్క్‌అవుట్ అవ్వదు కదా. ఒకవేళ పాత హీరోయిన్స్‌ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తారో..! ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Is Chiranjeevi not comfortable with romantic scenes in his films?, ‘రొమాంటిక్‌ సీన్లు’.. చిరంజీవికి తలనొప్పిగా మారాయా..?

Related Tags