ఆ హీరోయిన్ కు మెగాస్టార్ పొలిటికల్ సపోర్ట్ ఇస్తున్నాడా..!

దివంగత నటుడు అంబరీష్ సతీమణి నటి సుమలత రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న విషయం తెలుస్తోంది. అంబరీష్ చివరి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీలోకే ఆమె కూడా చేరాలని నిర్ణయించుకున్నారట. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయాలని భావిస్తున్నారట. ఆ నియోజకవర్గంలో జేడీఎస్ కు బలం బాగానే ఉంది. అందువల్ల సుమలతకు అక్కడ అనుకూలత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి, సుమలతకు లోక్ సభ […]

ఆ హీరోయిన్ కు మెగాస్టార్ పొలిటికల్ సపోర్ట్ ఇస్తున్నాడా..!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:15 PM

దివంగత నటుడు అంబరీష్ సతీమణి నటి సుమలత రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న విషయం తెలుస్తోంది. అంబరీష్ చివరి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీలోకే ఆమె కూడా చేరాలని నిర్ణయించుకున్నారట. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయాలని భావిస్తున్నారట. ఆ నియోజకవర్గంలో జేడీఎస్ కు బలం బాగానే ఉంది. అందువల్ల సుమలతకు అక్కడ అనుకూలత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి, సుమలతకు లోక్ సభ సీట్ ఇప్పించే విషయంలో చర్చలు జరుపుతున్నారట. అంబరీష్ కు, చిరంజీవికి మధ్య స్నేహం ఉండేది. అంతేకాదు సుమలతతో కూడా చిరంజీవి ఎక్కువ సినిమాల్లో నటించాడు. ఈ కారణం చేత చిరంజీవి సుమలతకు పొలిటికల్ సపోర్ట్ ఇస్తున్నాడని టాక్ నడుస్తోంది. ఇది ఇలా ఉంటే చిరంజీవి రాజ్యసభ గడువు ముగిసిన దగ్గర నుంచి కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నాడు. అలాంటప్పుడు చిరంజీవికి లోక్ సభ సీట్ విషయంలో లాబీయింగ్ చేసేంత సీన్ లేదని కొంతమంది రాజకీయ నేతలు అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం మాత్రం అటు కర్ణాటక కాంగ్రెస్ తో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది.