Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

బాబు తహతహపై.. బీజేపీ నీళ్లు

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. అది చాలా సందర్భాల్లో నిజమని తేలింది కూడా. అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో పొత్తుల విషయంలో అనేకమార్లు బద్ధ శత్రువులు అనుకున్న పార్టీలు ఒక్కటయ్యాయి. అదే సమయంలో పొత్తులో విజయం సాధించి మధ్యలోనే ఆ పొత్తులను తెగదెంపులు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏపీ రాజకీయం.

2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎన్డీఏలో భాగస్వామిగా చేరారు. ఆ తర్వాత ఎన్నికలు మరో ఏడాది ఉందనగా.. ఎన్డీఏకి గుడ్‌బై చెప్పి.. ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం మంచిది కాదని పార్టీ శ్రేణుల్లో అభిప్రాయం వెలువడినా.. బీజేపీపై కోపంతో కాంగ్రెస్‌ పక్కన చేరారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్రంపై యుద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అప్పటికే కేంద్రంలోని బీజేపీ నేతలు.. వైసీపీ ట్రాప్‌లో పడుతున్నారని.. ఓ సారి ఆలోచించుకోవాలని సూచించారు. అయితే వారి మాటలు లెక్కచేయకుండా వైసీపీ వేసిన స్కెచ్‌లో చిక్కుకుపోయారు చంద్రబాబు. అయితే ఆ విషయం ఇప్పుడిప్పుడే బోధపడింది.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత టీడీపీ కీలక నేతలు చాలా మంది బీజేపీ గూటికి చేరుకున్నారు. ముఖ్యంగా నలుగురు రాజ్యసభ సభ్యలు టీడీపీకి గుడ్‌బై చెప్పి.. కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక క్షేత్ర స్థాయిలో కూడా పలువురు నేతలు వైసీపీ వెళ్లలేక.. బీజేపీ వైపే చూస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఘోరంగా తయారవడంతో.. మళ్లీ తిరిగి బీజేపీతో జతకట్టేందుకు బాబు ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకు పలువురు సీనియర్ నేతలతో రాయబారం నడిపినట్లు కూడా తెలుస్తోంది. అది వర్క్‌అవుట్ కాకపోవడంతో.. ఏకంగా ఆయనే ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. దీనికి పార్టీ కార్యక్రమం వేదికగా ఆయన వైఖరి చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి కారణాలపై విశ్లేషణ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతోను, అక్కడ అధికారంలో వున్న బీజేపీ అధినేతలతోను విభేదించడం.. వారిపై రాజకీయ పోరాటం చేయడమే తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణమైందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇప్పుడు అవకాశం లభిస్తే మళ్లీ కమలం గూటికి చేరేందుకు చూస్తున్నట్లు ఆయన అభిప్రాయాన్ని పరోక్షంగా వెల్లడించారు.

చంద్రబాబు వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. టీడీపీకి ద్వారాలు ఎప్పుడో మూసేశామంటూ ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ సహా కాషాయ నేతలంతా స్పష్టం చేస్తున్నారు. అయితే ఓ వైపు కమల దళం టార్గెట్ 2024 లక్ష్యంగా జోరు పెంచుతోంది. అందుకు తగ్గట్లుగా ఇతర పార్టీనేతలను తమ గూటికి చేర్చుకుంటూ.. పక్కా స్కెచ్ వేస్తోంది. అయితే ఇదే సమయంలో ఏపీలో పునర్ వైభవం సాధించాలన్న ఆలోచనలో చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.

అయితే గత ఎన్నికల్లో ఇరు పార్టీల నేతలు.. తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్న విషయం విధితమే. కార్యకర్త స్థాయి నుంచి మంత్రుల వరకు కేంద్రంపై దుమ్మెత్తిపోశారు. మరోవైపు బీజేపీ శ్రేణులు చంద్రబాబు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ ఎన్డీఏలో చేరితే.. అది పార్టీకి నష్టం అన్న అభిప్రాయంతో బీజేపీ శ్రేణులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర బీజేపీ నేతల సమావేశం సందర్భంగా చంద్రబాబు ప్రస్తావన వచ్చినప్పుడు అమిత్ షా.. టీడీపీకి తాము ద్వారాలు పూర్తిగా మూసేసినట్లు స్పష్టత ఇచ్చారని తెలిపారు. ఇదే విషయాన్ని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ కూడా సోషల్ మీడియా వేదికగా అమిత్ షా వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.

సునీల్ దియోధర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే టీడీపీ ఓవైపు బీజేపీతో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నా.. మరోవైపు ఆ పార్టీలో చేరాలనుకునే నేతలకు అడ్డుపుల్ల వేస్తున్నట్లు అర్ధమవుతోంది. భవిష్యత్తులో టీడీపీతో పొత్తు ఉండబోదని స్పష్టత ఇవ్వడం ద్వారా ఆ పార్టీ నుంచి నేతల వలసలను ప్రోత్సహించాలనే ఉద్దేశంలో కాషాయ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.