Breaking News
  • ఎన్‌ఆర్సీ బీజేపీ కార్యాలయంలో తయారుచేసే చట్టం కాదు. ఇప్పటికిప్పుడు కేవలం సీఏఏ గురించే ఆలోచిస్తున్నాం. ఎన్‌ఆర్సీపై ఇప్పుడు ఎలాంటి చర్చ జరపడం లేదు-మురళీధర్‌రావు. అసోంలో ఎన్‌ఆర్సీ విధానాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. అసోంలో అమలవుతున్న ఎన్‌ఆర్సీ విధానాలే.. దేశం మొత్తం మీద ఉంటుందని భావించలేం-మురళీధర్‌రావు. అసోంతో ఇతర రాష్ట్రాల పరిస్థితులను పోల్చలేం. -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు.
  • చిత్తూరు: సోమల అటవీప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్య. చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న హేమలత, ముని. పది రోజుల నుంచి కనిపించకుండా పోయిన హేమలత, ముని. ఇంటర్‌ చదువుతున్న హేమలత, ఆటో నడుపుతున్న ముని.
  • తూ.గో: రంపచోడవరం మండలం చిలకమామిడిలో గిరిజనుల ఆందోళన. సోమిరెడ్డి అనే వ్యక్తి మృతదేహంలో ఐటీడీఏ ఎదుట ఆందోళన. రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి సూరింటెండెంట్‌పై.. చర్యలు తీసుకోవాలని పీవోని కలిసిన సోమిరెడ్డి బంధువులు, గ్రామస్తులు. సరైన వైద్యం అందుబాటులోలేక ప్రాణాలు పోతున్నాయంటున్న గ్రామస్తులు.
  • మావోయిస్టు పార్టీల నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు మావోయిస్టుల నేతల అక్రమ వసూళ్లకు ప్రజలు సహకరించొద్దు మావోయిస్టు నేతలకు అక్రమంగా డబ్బులు వసూలు చేసే.. సర్వేష్‌, పెద్దిరెడ్డిని పోలీస్‌ ఇన్‌ఫార్మర్లుగా చిత్రీకరించారు మావోయిస్టు ఉత్తరాలు అందిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి -భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 35,223 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు.
  • సూర్యాపేట: హుజూర్‌నగర్‌లో చిన్నారి శ్రావ్య అదృశ్యం. 26 రోజుల నుంచి కనిపించకుండా పోయిన శ్రావ్య. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన శ్రావ్య తండ్రి సాంబశివరావు.

టాలీవుడ్ నయా ట్రెండ్.. బూతు సినిమాలు…

bold content secret for success at box office?, టాలీవుడ్ నయా ట్రెండ్.. బూతు సినిమాలు…

సినిమా అంటేనే బిజినెస్ అనేది కొందరి భావన. ఉద్దేశం ఏదైనా.. దర్శక నిర్మాతలు కోరుకునేది లాభాలు మాత్రమే. ఒకవేళ అది కాస్తా ఫెయిల్ అయితే భారీ ప్లాప్‌లు చవి చూడాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా తెలుగు సినిమా పరంగా కొన్ని నియమాలు, పరిమితులు ఉంటాయి. ఇతర భాషల్లో తీసే సినిమాల మాదిరిగా మన నిర్మాతలు తెలుగు సినిమాలను రూపొందించరు. ఆ సినిమా పరిమితులకు లోబడి తీసిన చిత్రాలకు ప్రేక్షకులు ఆమోద ముద్ర వేస్తూ.. చిరస్మరణీయ విజయాలను అందిస్తున్నారు. ఒకవేళ ఆ స్థాయి గతి తప్పితే మాత్రం సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎదుర్కోక తప్పదు.  ఇది ఇలా ఉండగా కొందరు మీడియం, లో బడ్జెట్ నిర్మాతలు.. వారి స్వలాభం కోసం టాలీవుడ్ పరిమితులను పక్కన పెట్టి.. కొన్ని నాసిరకమైన బీ, సీ గ్రేడ్ సినిమాలు తీస్తుండటం సర్వ సాధారణం అవుతోంది. అవసరానికి మించిన ముద్దు సీన్లు – హీరొయిన్ చేత పదే పదే ఎక్స్ పోజింగ్ చేయించే సీన్లు రాసుకోవడం – బెడ్ రూమ్ లో ప్రైవేటుగా నడిపించాల్సిన శృంగారాన్ని బోల్డ్ నెస్ పేరుతో మొహమాటం లేకుండా తెరమీద చూపించేయడం ఇటీవల కాలంలో బాగా ఎక్కువైపోయింది.

ఇక ఇలాంటి సినిమాలు తీసేవారికి ఒకేఒక లక్ష్యం ఉంటుంది. వారు కేవలం డబ్బులు సంపాదించామా అనేది పట్టించుకుంటారు తప్ప.. ఈ సినిమాల ప్రభావం యువతపై ఎలా ఉంటుందో అన్నది పట్టించుకోరు. కథానుసారంగా వచ్చే శృంగార సన్నివేశాలు, బోల్డ్ సీన్స్‌ను తీయలేం. ‘ఆర్ఎక్స్100’ ‘అర్జున్ రెడ్డి’ వంటి చిత్రాలు ఎంత పెద్ద విజయాలు సాధించాయో అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రాల్లో కావాల్సినన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి. అయితే అవి కథానుసారంగా వస్తాయి తప్ప.. కావాలని జొప్పించినవి కావు. ఇదే అదునుగా చిన్న నిర్మాతలు కేవలం శృంగార సన్నివేశాలతో చిత్రాలను రూపొందించి.. మాది కల్ట్ క్లాసిక్ అని చెప్పుకుంటూ యువతను తప్పుదోవ పట్టిస్తుంటారు. ఇక వీటికి సంబంధించిన ట్రైలర్లు, టీజర్లు టీవీలో వచ్చేటప్పుడు చిన్న పిల్లలు అక్కడ లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెచ్యూరిటీ పేరిట అర్ధంలేని సినిమాలు తీస్తే వాళ్లకు నాలుగు డబ్బులు రావచ్చేమో గానీ.. ఇదే పద్దతిని ఫాలో అయితే రేపటి తరం యువత తమ కెరీర్‌లను నాశనం చేసుకునే పరిస్థితి వస్తుంది. పోనీ దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు మారతారని అనుకుంటే అది మన తెలివి తక్కువ తనమే అని చెప్పవచ్చు. ఇక రీసెంట్‌గా రిలీజైన సినిమా విషయానికి వస్తే.. కంటెంట్ తక్కువ.. బోల్డ్‌నెస్ ఎక్కువగానూ ఉంది.

అలాంటి సినిమాలు విడుదల చేసే ముందు ఫస్ట్ లుక్, టీజర్ల పేరుతో ప్రోమోలు విడుదల చేసి అందులో మోతాదుకు మించిన శృంగార సన్నివేశాలను మేళవించి.. చూడడానికే జిగుప్స కలిగించేలా చేస్తున్నారు. అంతేకాకుండా వాటి టైటిల్స్ కూడా అసభ్యకరంగా ఉంటున్నాయి. వీటికి సెన్సార్ బోర్డు ఉన్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఈ పోకడ మరింత ఎక్కువైంది. ఒకప్పుడు దర్శక నిర్మాతలు గిరి గీసుకుని పరిమితుల మేరకు సినిమాలు తీస్తే అందుకు విరుద్ధంగా నేటి పరిస్థితి మారిపోయింది. ఒకటో అరో సృజనాత్మకతకు, కళాత్మకతకు అద్దం పట్టే సినిమాలు వస్తున్నా… అవి అవార్డులకే పరిమితమవుతున్నాయి. అభివృద్ధి చెందిన టెక్నాలజీ నేపథ్యంలో మంచి కంటే చెడు ఎక్కువగా ప్రభావం చూపుతున్న దృష్ట్యా ఇలాంటి సినిమాలు మరుగున పడిపోతున్నాయి. కొందరిని మినహాయిస్తే.. చాలావరకు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ ఇండస్ట్రీ చాలావరకు బీ, సీ సెంటర్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రెస్‌గా మారిపోతుండటం నిర్వివాదాంశం.

Related Tags