టీడీపీతో గేమ్స్‌ ఆడుతోన్న బీజేపీ

రాజకీయ చదరంగం.. ఈ ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఎప్పుడు ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారో తెలియదు. అంతేకాదు.. ఇందులో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అస్సలు ఉండరు. అది అనేక సందర్భాల్లో నిజమని తేలింది కూడా. ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం ఫ్రూవ్ అవుతోంది. తాజాగా బీజేపీ, టీడీపీల మధ్య జరుగుతున్న సంభాషణ.. సర్వత్రా ఆసక్తిగా మారుతోంది. గతంలో ఇరు పార్టీలు పొత్తులో విజయం సాధించి అధికారాన్ని చేపట్టాయి. ఆ […]

టీడీపీతో గేమ్స్‌ ఆడుతోన్న బీజేపీ
Follow us

| Edited By:

Updated on: Oct 20, 2019 | 4:10 PM

రాజకీయ చదరంగం.. ఈ ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఎప్పుడు ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారో తెలియదు. అంతేకాదు.. ఇందులో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అస్సలు ఉండరు. అది అనేక సందర్భాల్లో నిజమని తేలింది కూడా. ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం ఫ్రూవ్ అవుతోంది. తాజాగా బీజేపీ, టీడీపీల మధ్య జరుగుతున్న సంభాషణ.. సర్వత్రా ఆసక్తిగా మారుతోంది. గతంలో ఇరు పార్టీలు పొత్తులో విజయం సాధించి అధికారాన్ని చేపట్టాయి. ఆ తర్వాత ఎన్నికలకు ఏడాది ఉందన్న సమయంలో విడిపోయారు.

ఆ తర్వాత నాలుగేళ్లు పోత్తులో ఉన్న ఇరు పార్టీలు.. విడిపోయాక.. తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగాయి. అయితే ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీన్ మారింది. రాష్ట్రానికి కేంద్రం మోసం చేసిందటూ ఆరోపించిన టీడీపీ.. కేంద్రంపై యుద్ధం అంటూ ఎన్నికల ప్రచారంలోకి వెళ్లింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల్లో టీడీపీ ఓటమిని చవిచూసి వచ్చింది. సీన్ కట్ చేస్తే.. కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు గడిచింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రాజ్యసభలో ఉన్న ఎంపీలు సైకిల్ దిగి.. కమలం గూటికి చేరారు. అంతేకాదు.. సీనియర్ కార్యకర్తలు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పి.. బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందనుకున్న అధినేత.. ఎన్నికల ముందు చేసిన తప్పులపై ఆత్మవిమర్శ చేసుకున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వంతోను, అక్కడ అధికారంలో వున్న బీజేపీ అధినేతలతోను విభేదించడం.. వారిపై రాజకీయ పోరాటం చేయడమే తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణమైందంటూ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇప్పుడు అవకాశం లభిస్తే మళ్లీ కమలం గూటికి చేరేందుకు చూస్తున్నట్లు ఆయన అభిప్రాయాన్ని పరోక్షంగా వెల్లడించారు.

అయితే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై కమలనాథులు రియాక్ట్ అయ్యారు. పార్టీ క్యాడర్‌ను కాపాడుకునేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ శ్రేణులు ఎదురుదాడికి దిగారు. అంతేకాదు.. ఈ విషయంలో రాష్ట్రానికి చెందిన కీలక నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గత వారంలో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దియోధర్ చేసిన వ్యాఖ్యలు టీడీపీకి చెక్ పెట్టినట్లు అనిపిస్తే.. మరో బీజేపీ నేత.. రాజ్యాసభ ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నాయి.

టీడీపీకి ద్వారాలు ఎప్పుడో మూసేశామంటూ ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ చేసిన వ్యాఖ్యలు పొత్తులకు ఆస్కారం లేదన్నట్లు తేలిపోయింది. అయితే తాజాగా రాజ్యసభ ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు.. సంచలనంగా మారాయి. టీడీపీతో బీజేపీ పొత్తుల కోసం చర్చలు ఉండవంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పూర్తిగా బీజేపీలో కలిపేస్తామంటే ఆలోచిస్తామని.. ఈ విషయంలో హైకమాండ్‌తో తానే మాట్లాడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే టీడీపీ విలీనం అనేది కలలో కూడా ఊహించని పని. ఒకవేళ అదే జరిగితే టీడీపీ చరిత్రలో కలిసిపోయినట్లే. అది జరగదని జీవీఎల్‌కి కూడా తెలుసు. అయినప్పటికీ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే.. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీ.. గత ఎన్నికల్లో అదే కాంగ్రెస్‌ పార్టీతో చేతుల కలిపి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. మరి జీవీఎల్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందించబోతోందో వేచి చూడాలి.

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..