Breaking News
  • అమరావతి: భూముల కొనుగోలుపై సీఐడీ కేసు నమోదు. ల్యాండ్‌ పూలింగ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సీఐడీ. 796 తెల్ల రేషన్‌కార్డు దారులపై కేసు నమోదు. రూ.3 కోట్లకు ఎకరం భూమి కొనుగోలు చేసిన తెల్ల రేషన్‌కార్డు దారులు. రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్టు గుర్తించిన సీఐడీ. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన సీఐడీ. మొత్తం 129 ఎకరాలు కొన్న 131 మంది తెల్ల రేషన్‌కార్డుదారులు. పెద్దకాకానిలో 40 ఎకరాలు కొన్న 43 మంది. తాడికొండలో 180 ఎకరాలు కొనుగోలు చేసిన 188 మంది. తుళ్లూరులో 243 ఎకరాలు కొన్న 238 మంది. మంగళగిరిలో 133 ఎకరాలు కొనుగోలుచేసిన 148 మంది. తాడేపల్లిలో 24 ఎకరాలు కొన్న 49 మంది తెల్ల రేషన్‌కార్డు దారులు.
  • కడప: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై అమరావతి జేఏసీ నేతల ఆగ్రహం. అమరావతి రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమాలు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం హర్షణీయం. మండలి చైర్మన్‌ పట్ల మంత్రుల తీరు బాధాకరం. ప్రజలే బుద్ధి చెబుతారు-జేఏసీ నేతలు రమణ, శ్రీనివాసులురెడ్డి.
  • నాపై ఆరోపణలు అవాస్తవం-ప్రత్తిపాటి పుల్లారావు. నాపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులపై న్యాయ పోరాటం చేస్తా. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగితే కేసులు పెట్టండి. తప్పు చేయకుండా కేసులు పెట్టడం అన్యాయం-ప్రత్తిపాటి.
  • అమరావతి: మంగళగిరి టీడీపీ ఆఫీస్‌కు భారీగా రాజధాని రైతులు. చంద్రబాబు, లోకేష్‌ను అభినందించిన రైతులు, కార్యకర్తలు. లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు. రైతులకు మద్దతుగా జన్మదిన వేడుకలకు దూరంగా లోకేష్‌.
  • ప.గో: పాలకొల్లులో మండలి చైర్మన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జేఏసీ నేతలు, చైర్మన్‌కు బొకేలు ఇచ్చిన అభినందనలు తెలిపిన జేఏసీ నేతలు.

పారాసిటమాల్ కన్నా బీరే బెటర్ గురూ! ఎందుకంటే ?

Is Beer A Better Painkiller Than Paracetamol, పారాసిటమాల్ కన్నా బీరే బెటర్ గురూ! ఎందుకంటే ?

బీరు ప్రియులకు శుభవార్త..బీరు ఆర్యోగానికి మంచిదే కాదు, రోగాలను కూడా నయం చేస్తుందనే విషయం ఇప్పుడు రుజువైంది. బీరు మన శరీరాన్ని సంరక్షించడం లో ఉత్తమంగా పనిచేస్తుందని రీసెంట్ స్టడీస్ చెబుతున్నాయి. ధాన్యపు గింజల నుంచి బీరు ని తయారు చేయడం వల్ల వీటిల్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. బీరు లో అధిక మొత్తంలో ప్రోటీన్లు ఇంకా విటమిన్ బి కూడా లభిస్తుంది. ఇవి వైన్ లో కంటే కూడా బీరు లోనే అధికంగా లభిస్తాయి..అంతే కాదు బీర్ లో మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం, ఫాస్పరస్ లాంటి ఖనిజాలు అధికంగా లభ్యమవుతాయి. ఇవన్నీ జీర్ణ క్రియ ప్రక్రియలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి ఇంకెన్నో విధాలుగా ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాగే, కాల్షియం, కాపర్, ఐరన్, పొటాషియం, సిలికాన్, సోడియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం ఇంకా జింక్ వంటి మినరల్స్ లభిస్తాయని మనకి తెలిసిన సంగతే.

ఇవ్వే కాదు, తలనొప్పికి కూడా బీర్ చక్కగా పనిచేస్తుందని కొత్త విషయం వెలువడింది.. బాగా తలనొప్పి వచ్చినప్పుడు ఓ రెండు గ్లాసుల బీరును లాగించేస్తే తలనొప్పి పరారవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా తలనొప్పికి తీసుకునే పారాసిటమాల్ కంటే బీరు చాలా బాగా పని చేస్తుందని ఈ స్టడీస్ రుజువు చేసాయి..యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్ విచ్ 400 మందిపై జరిపిన 18 స్టడీస్ ఈ విషయాన్ని నిరూపించాయి. తగిన మోతాదులో బీర్ తీసుకుంటే అది ఇప్పుడున్న పెయిన్ కిల్లర్స్ అన్నిటికంటే బాగా పని చేస్తుందని తాము కనుగొన్నామని ఈ పరిశోధనలు చేపట్టిన డాక్టర్ ట్రెవర్ థామ్సన్ అన్నారు. అయితే, అదే పనిగా బీర్ ని తాగితే మాత్రం దానికుండే సైడ్ ఎఫెక్టని కూడా ఎదుర్కోవల్సి ఉంటుందని ఆయన హెచ్చరిస్తున్నారు