Breaking News
  • ఢిల్లీ: మరో క్రీడా ఈవెంట్‌పై కరోనా ప్రభావం. మార్చి నుంచి జరగాల్సిన షూటింగ్‌ ప్రపంచకప్‌ రద్దు. అంతర్జాతీయ షూటింగ్‌ స్పోర్ట్ సమాఖ్య, భారత షూటింగ్ సంఘం నిర్ణయం.
  • హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌ ఎన్టీఆర్‌ గార్డెన్‌ దగ్గర కారు బీభత్సం. డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా, యువకుడికి గాయాలు. కారులో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో తప్పిన ప్రాణాపాయం. యువకుడిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు. కారులో మద్యం బాటిల్‌ లభ్యం. కేసు నమోదు చేసిన సైఫాబాద్‌ పోలీసులు.
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 32కు చేరిన కరోనా కేసులు. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట పరిధిలో 12 హాట్‌స్పాట్స్. లాక్‌డౌన్‌ను కఠినతరం చేసిన పోలీసులు. వేర్వేరు దేశాల నుంచి ట్రావెల్ చేసిన.. 814 మందికి 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి. ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లలో 246 మంది అనుమానితులు. ఎంజీఎంలోని ఐసోలేషన్‌ వార్డులో 11 మంది అనుమానితులు.
  • కరోనా కట్టడి కోసం పీఎం కేర్స్‌కు భారీగా విరాళాలు. పీఎం కేర్స్‌కు రూ.52 కోట్ల విరాళం ఇచ్చిన 12 ప్రధాననౌకాశ్రయాలు.. షిప్పింగ్ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థలు.
  • ఏపీలో కరోనా పరీక్షా కేంద్రాల సామర్థ్యం పెంపు. విశాఖ, గుంటూరు, కడపలో కరోనా పరీక్షా కేంద్రాల సామర్థ్యం పెంపు. ప్రాథమిక స్థాయిలోనూ పరీక్షల నిర్వహణకు అనుమతులు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి 240 పరికరాలు. కొవిడ్‌-19పై సమీక్షలో సీఎం జగన్‌ వెల్లడి.

అల్యూమినియం పాత్రలు వాడితే .. జర భద్రం !

Is Aluminium Cookware Safe Or Not, అల్యూమినియం పాత్రలు వాడితే .. జర భద్రం !

పూర్వకాలంలో వంట కోసం మట్టిపాత్రలనే వినియోగించేవారు. కానీ ఇప్పుడు స్టీల్, ఇత్తడి, కాపర్, అల్యూమినియం, నాన్ స్టిక్ వేర్ లాంటి రకరకాల వంట పాత్రలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, వీటన్నిటిలో ఎక్కువ శాతం మంది వంటగదుల్లో కనిపించేవి అల్యూమినియం పాత్రలే. అన్నం, కూర, చారు చివరికి టీ కాయడానికి కూడా మన వంట గదుల్లో అల్యూమినియం వస్తువులనే వినియోగిస్తుంటాం. మరి ఈ పాత్రలు ఎంతవరకూ సేఫ్ అనే ప్రశ్న ఇప్పుడు చర్చకు వచ్చింది. వంట చేసేటప్పుడు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవల్సిన విషయం ఒకటుంది. టమాటాల లాంటి యాసిడ్స్‌ కలిగిన పదార్థాలు, అలాగే పుల్లని పదార్థాలు వండటం కోసం అల్యుమినియం పాత్రలను వాడినపుడు వీటినుంచి ఎక్కువ శాతం అల్యూమినియం పదార్థాలలో కలిసే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం వల్ల బ్రెయిన్ సెల్స్ డామేజ్ అయ్యే అవకాశం ఉందని వైద్య పరిశోధనల్లో రుజువైంది. వీటిని ఎక్కువకాలం వాడితే, షుగర్, కీళ్ళ నొప్పులు, లివర్ వ్యాధులు, కిడ్ని సమస్యలు, గుండె సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పరిశోధనలు తేల్చాయి.
మరి ఈ వస్తువులను అలా వాడకుండా వదిలేయాలా అంటే? దానికీ ఓ మార్గముంది. అల్యూమినియం పాత్రలు వాడాల్సి వచ్చినప్పుడు వాటిలో ఎక్కువసేపు పుల్లటి, లేదా యాసిడ్ కలిగిన పదార్ధాలను నిల్వ ఉంచకూడదు, అలాగే ఈ పాత్రల్లో ఫ్రై లాంటి వంటలు కూడా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్యూర్ అల్యూమినియం కాకుండా ఎనోడైజ్డ్ అల్యూమినియం మెటల్‌తో తయారు చేసిన పాత్రలు వాడితే అది వంటల్లో కలిసే ప్రమాదం అంతగా ఉండదని పరిశోధకులు చెప్తున్నారు.

Related Tags