’96’ తెలుగు రీమేక్ ఆగిపోనుందా..?

తమిళ హీరో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన చిత్రం ’96’. గతేడాది రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాని శర్వానంద్, సమంతా హీరో హీరోయిన్లుగా నిర్మాత దిల్ రాజు తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు, దర్శకుడు ప్రేమ్ […]

'96' తెలుగు రీమేక్ ఆగిపోనుందా..?
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:16 PM

తమిళ హీరో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన చిత్రం ’96’. గతేడాది రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాని శర్వానంద్, సమంతా హీరో హీరోయిన్లుగా నిర్మాత దిల్ రాజు తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు, దర్శకుడు ప్రేమ్ కుమార్ మధ్య చిన్న విభేదం తలెత్తినట్లు తెలుస్తోంది. దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాలో సంగీత దర్శకుడిగా తమిళ వెర్షన్ కి స్వరపరిచిన గోవింద్ వసంతను ఎంపిక చేయాలని చూస్తుంటే దిల్ రాజు మాత్రం పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ని తీసుకోవాలి భావిస్తున్నాడట. అంతేకాదు స్క్రిప్ట్ లో తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేయమని కూడా సూచించాడట దిల్ రాజు. కానీ ఇది దర్శకుడు ప్రేమ్ కుమార్ కి అసలు నచ్చలేదని వినికిడి. దీనితో వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి.

ఇక హీరో శర్వానంద్ స్పెయిన్ లో తన కొత్త చిత్రం షూటింగ్ లో ఉండగా హీరోయిన్ సమంతా ‘మజిలీ’, లేడీ ఓరియెంటెడ్ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉంది.