పఠాన్‌ భాయ్ రికార్డ్..కరీబియన్‌ లీగ్‌కు దరఖాస్తు

భారత ఫాస్ట్‌ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు. వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో ఆడేందుకు ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నాడు. ఏ జట్టు యాజమాన్యం అయినా సరే పఠాన్‌ను తీసుకుంటే కరీబియన్‌ లీగ్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి భారత ఆటగాడుగా ఇర్ఫాన్‌ చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకూ భారత్‌ నుంచి ఏ ఆటగాడు ఈ లీగ్‌లో ఆడలేదు. పఠాన్‌తో పాటు ఈ లీగ్‌లో ఆడేందుకు ఇంగ్లాండ్‌ ఆటగాడు అలెక్స్‌ హేల్స్‌, ఐపీఎల్‌ స్టార్స్‌ రషీద్‌ఖాన్‌, షకిబుల్‌ […]

పఠాన్‌ భాయ్ రికార్డ్..కరీబియన్‌ లీగ్‌కు దరఖాస్తు
Follow us

|

Updated on: May 17, 2019 | 4:17 PM

భారత ఫాస్ట్‌ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు. వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో ఆడేందుకు ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నాడు. ఏ జట్టు యాజమాన్యం అయినా సరే పఠాన్‌ను తీసుకుంటే కరీబియన్‌ లీగ్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి భారత ఆటగాడుగా ఇర్ఫాన్‌ చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకూ భారత్‌ నుంచి ఏ ఆటగాడు ఈ లీగ్‌లో ఆడలేదు. పఠాన్‌తో పాటు ఈ లీగ్‌లో ఆడేందుకు ఇంగ్లాండ్‌ ఆటగాడు అలెక్స్‌ హేల్స్‌, ఐపీఎల్‌ స్టార్స్‌ రషీద్‌ఖాన్‌, షకిబుల్‌ హాసన్‌, జొఫ్రా ఆర్చర్‌, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జేపీ డుమినీ కూడా తమ పేర్లను సమర్పించారట. ఐపీఎల్‌ మాదిరిగానే సీపీఎల్‌లోనూ ప్రతి ఫ్రాంచైజీకి పాత ఆటగాళ్లను అంటిపెట్టుకొని ఉండే అవకాశం ఉంది. మొత్తం ఆరుగురు ఆటగాళ్లను రిటైన్‌ చేసుకోవచ్చు. కనిష్ఠంగా ముగ్గుర్ని, గరిష్ఠంగా నలుగురు స్వదేశీ ఆటగాళ్లను రిటైన్‌ చేసుకోవచ్చు. ఒక విదేశీ ఆటగాడిని అట్టిపెట్టుకోవచ్చు. సెప్టెంబర్‌ 4 నుంచి అక్టోబర్‌ 12 వరకూ జరగనున్న ఈ లీగ్‌లో ఆడేందుకు ఇప్పటికే 536 మంది విదేశీ ఆటగాళ్లు దరఖాస్తులు చేసుకున్నారని సీపీఎల్‌ తన అధికారిక వెబ్‌సైట్లో తెలిపింది.

అయితే, పఠాన్‌ కరీబియన్‌ లీగ్‌లో పాల్గొనాలంటే బీసీసీఐ నుంచి నో అబ్జక్షన్ లెటర్  ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, భారత ఆటగాళ్లు ఇతర దేశవాళీ లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ సుముఖత చూపించడం లేదు.