ఇకపై రైళ్లలో నవ్వుతూ పలకరించనున్న ట్రైన్ హోస్టెస్

IRCTC training air hostess to behave on lines of airline staff, ఇకపై రైళ్లలో నవ్వుతూ పలకరించనున్న ట్రైన్ హోస్టెస్

విమానాల్లో ఆతిథ్య సేవలు అందించే ఎయిర్ హోస్టెస్ మనకు తెలిసిందే. అచ్చం అలాంటి సేవల్ని రైళ్లలో కూడా అందించేందుకు ఇండియన్ రైల్వే రెడీ అవుతోంది. ఇప్పటికే గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. తాజాగా ఈ విధానాన్ని మిగిలిన రైళ్లకు అందించాలని ఐఆర్‌సీటీసీ రెడీ అవుతోంది. ఇలా సేవలు అందించే వీరిని ట్రైన్ హోస్టెస్‌గా పిలుస్తారు.

ఈ విధంగా సేవలు అందించే ట్రైన్ హోస్టెస్.. తమ డ్యూటీకి తగ్గట్టుగా యాప్రాన్ వేసుకుని ,తలపై టోపీతో ప్రయాణికుల వద్దకు వచ్చి నవ్వుతూ పలకరిస్తారు. ఆహారం, పానీయాలు వంటి సేవలపై వివరాలు అడిగి తెలుసుకుంటారు. ఎయిర్ హోస్టెస్ మాదిరిగా రైళ్లలో కేవలం యువతులు మాత్రమే కాకుండా మేల్ స్ట్యూవర్డ్స్ కూడా ఉంటారు. వీరు ప్రయాణికులు సౌకర్యవంతంగా తమ గమ్యానికి చేరుకోవడంలో అవసరమైన సేవల్ని అందించనున్నారు. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ 2వేల మందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తోంది. ఇప్పటి వరకు గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌లోనే అందుబాటులో ఉన్న ఈ సేవలు, మరికొన్ని రైళ్లకు కూడా విస్తరించేందుకు రెడీ అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *