Breaking News
  • ప్రజలు ఘోరంగా తిరస్కరించినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు. కష్టకాలంలో కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు-అంబటి. రాష్ట్ర ఖజానా నుంచే రూ.1000 ఇచ్చాం. దీనిపై కూడా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు-అంబటి. ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి.. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు-వైసీపీ నేత అంబటి.
  • పశ్చిమ బెంగాల్‌లో మందుబాబులకు గుడ్‌ న్యూస్‌. పశ్చిమ బెంగాల్‌లో మ.2 గంటల నుంచి సా.5 గంటల వరకు.. మద్యం పంపిణీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం. ఉ.11 నుంచి మ.2 గంటల వరకు బార్ల నుంచి అర్డర్లు. మ.2 గంటల నుంచి పోలీసుల ద్వారా పంపిణీకి అనుమతి.
  • ప్రకాశం: ఒంగోలులో మరో మూడు పాజిటివ్‌ కేసులు. ప్రకాశం జిల్లాలో 27కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు.
  • తూ.గో: సామర్లకోటలో మట్టి తవ్వకాలను అడ్డుకున్న చినరాజప్ప. మట్టి మాఫియా చెలరేగిపోతోంది-ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. మట్టి అక్రమ తవ్వకాలపై కలెక్టర్‌తో మాట్లాడా. పెద్దపులి చెరువులో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని.. అక్రమ తవ్వకాలపై విచారణ జరిపిస్తామని కలెక్టర్‌ తెలిపారు-చినరాజప్ప.
  • తమిళనాడులో వేగంగా విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి. ఈ రోజు తమిళనాడులో 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఇప్పటి వరకు తమిళనాడులో 738 కరోనా కేసులు నమోదు.

ఇరాక్ మళ్ళీ రక్తసిక్తం.. ఆందోళనల్లో 40 మందిమృతి.. అవినీతిపై ఎలుగెత్తిన యువత

iraq protests.. 40 dead as mass unrest descends violence, ఇరాక్ మళ్ళీ రక్తసిక్తం.. ఆందోళనల్లో 40 మందిమృతి.. అవినీతిపై ఎలుగెత్తిన యువత

ఇరాక్ మళ్ళీ రక్తసిక్తమైంది. రాజధాని బాగ్దాద్ నిరసనకారుల ఆందోళనతో అట్టుడికింది. పెద్దఎత్తున జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో వేలాదిమంది పాల్గొన్నారు. శుక్రవారం బాగ్దాద్ లోని తహరీర్ స్క్వేర్ (గ్రీన్ జోన్) ప్రాంతానికి చేరుకున్న ఆందోళనకారులను అడ్డుకునేందుకు సాయుధ దళాలు రబ్బరు బులెట్లను, బాష్పవాయువును ప్రయోగించాయి. ఈ ఘర్షణల్లో 40 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. (ఈ జోన్ లో అనేక ప్రభుత్వ కార్యాలయాలు, విదేశీ ఎంబసీలు ఉన్నాయి). తమకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలని, ప్రజా సేవలు మెరుగుపరచాలని, అవినీతిని అంతమొందించాలని ముఖ్యంగా యువకులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన అల్లర్లలో సుమారు 2 వేల మంది గాయపడ్డారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బాగ్దాద్ నగరంలోని దివానియా పట్టణంలో పారామిలిటరీ కార్యాలయానికి నిప్పు పెట్టేందుకు వఛ్చిన నిరసనకారులను చెదరగొట్టేందుకు సైనికులు మొదట లాఠీచార్జి చేసి బాష్ప వాయువు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో 12 మంది మరణించారు ఆందోళనకారుల దాడుల్లో . భద్రతా దళాల్లోనూ కొందరు గాయపడ్డారు. ధీకార్ ప్రావిన్స్ లో ఓ ప్రభుత్వ కార్యాలయంలోనికి చొచ్ఛుకుపోయేందుకు దాదాపు మూడు వేలమంది ప్రయత్నించారు. ముతన్నా ప్రావిన్స్ లో షియా పొలిటికల్ కార్యాలయాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. వీరిలో చాలామంది ఇరాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
iraq protests.. 40 dead as mass unrest descends violence, ఇరాక్ మళ్ళీ రక్తసిక్తం.. ఆందోళనల్లో 40 మందిమృతి.. అవినీతిపై ఎలుగెత్తిన యువతఅయితే హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ప్రధాని అదిల్ అబ్దుల్ మెహరీ హెచ్చరించారు.అవినీతిని అదుపు చేసేందుకు యత్నిస్తామని, యువతకు ఉద్యోగావకాశాలుకల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ హామీలను యువకులు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ నెలారంభంలో జరిగిన నిరసన ప్రదర్శనల్లో హింస పెల్లుబికి 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత సంవత్సరమే ప్రధాని పదవిలోకి వఛ్చిన మెహరీ.. దేశ ప్రయోజనాల పరిరక్షణకు తనకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఆయన మాటలను ‘ గాలికబుర్లు ‘గా ఆందోళనకారులు కొట్టిపారేస్తున్నారు. ఇరాన్ పట్ల మెతక వైఖరి ఎందుకన్నదే వీరి ప్రశ్న.మరోవైపు ఇరాక్ లోని తాజా పరిణామాలను అమెరికా నిశితంగా గమనిస్తోంది. ఇప్పుడిప్పుడే సిరియా-టర్కీ మధ్య సైనిక చర్యను నివారించడంలో సఫలమైన ‘ పెద్దన్న ‘.. ట్రంప్.. వైట్ హౌస్ లో ఇరాక్ ‘ ఘర్షణల ‘ పై చర్చించినట్టు సమాచారం.

Related Tags