Iran Chief: ప్రపంచంలో ఎక్కడున్నా తప్పించుకోలేరు.. డొనాల్డ్‌ ట్రంప్‌ను హెచ్చరించిన ఇరాన్‌ అధినేత

Iran Chief: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ చీఫ్‌ ఆయుతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. 2020లో జరిగిన డ్రోన్‌ దాడికి...

Iran Chief: ప్రపంచంలో ఎక్కడున్నా తప్పించుకోలేరు.. డొనాల్డ్‌ ట్రంప్‌ను హెచ్చరించిన ఇరాన్‌ అధినేత
Follow us

|

Updated on: Jan 23, 2021 | 2:29 PM

Iran Chief: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ చీఫ్‌ ఆయుతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. 2020లో జరిగిన డ్రోన్‌ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికను రాశారు. గత ఏడాది జనవరిలో బాగ్దాద్‌లో జరిగిన అమెరికన్‌ డ్రోన్‌ దాడిలో రివల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్‌ ఖాసీం సులేమాని మరణించారు. ఆయన అయతొల్లా అలీ ఖమేనికి కుడి భుజం లాంటి వ్యక్తి. ఆయన హత్యకు ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటామనే హెచ్చరికలు చాలాకాలం నుంచి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఖమేనీ అధికారిక ట్విటర్‌ ఖాతాలో ట్రంప్‌ను హెచ్చరిస్తూ ఓ ట్వీట్‌ను పోస్టు చేశారు. సులేమాని హంతకుడు, అందుకు ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి తప్పనిసరిగా ప్రతిహింసను ఎదుర్కొక తప్పదని, తమ నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ఏ క్షణంలోనైనా ప్రతిహింస జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

కాగా, గత ఏడాది జనవరి నెలలో ఇరాన్‌ టాప్‌ కమాండర్‌ సులేమాని హత్య జరిగింది. ఈ నెలతో ఏడాది పూర్తయినందున జ్యుడిషియరీ చీఫ్‌ ఎబ్రహీంరైసీ కూడా ట్రంప్‌ను హెచ్చరించారు. సులేమాని హంతకులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండలేరని హెచ్చరించడం సంచలనంగా మారింది.

Also Read: డొనాల్డ్ ట్రంప్ అభిశంసన విచారణకు ముహూర్తం ఖరారు, ఫిబ్రవరి 9 నుంచి, ఎట్టకేలకు సెనేట్ లో కుదిరిన అంగీకారం