కరోనా ఎఫెక్ట్.. ఆ 70వేల మంది ఖైదీలు విడుదల..!

కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. ఇరాన్, ఇటలీలలో ఆదివారం ఒక్క రోజే దాదాపు 135 మంది మృతిచెందారు. ఇరాన్ లో మొత్తం మృతుల సంఖ్య 237కు

కరోనా ఎఫెక్ట్.. ఆ 70వేల మంది ఖైదీలు విడుదల..!
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2020 | 7:17 PM

Iran: కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. ఇరాన్, ఇటలీలలో ఆదివారం ఒక్క రోజే దాదాపు 135 మంది మృతిచెందారు. ఇరాన్ లో మొత్తం మృతుల సంఖ్య 237కు చేరింది. మరో 7వేల మందికి పైగా ఈ వైరస్‌ బారినపడి చికిత్స పొందుతున్నారు.

కోవిద్ 19 వైరస్ చైనాతో పాటు ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో మరణమృదంగం మోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ లోని పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న దాదాపు 70వేల మంది ఖైదీలను విడుదల చేసింది. ఈ విషయాన్ని ఇరానియన్‌ జ్యుడీషియరీ చీఫ్‌ ఇబ్రహీం రైసీ వెల్లడించినట్టు తెలుస్తోంది. ఖైదీలను విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయంతో సమాజంలో ఎలాంటి అభద్రతా భావం కలగదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, విడుదలైన వారు తిరిగి జైళ్లకు రావాల్సిన అవసరం ఉందో, లేదో అనే విషయాన్ని వెల్లడించలేదు.