సెక్యూలర్‌ దేశంగా మారుతున్న ఇరాన్‌

ఇరాన్‌ మునుపటి ఇరాన్‌ కాదు.. ఆ దేశం అభివృద్ధి సాధించడంతో పాటు ఆధునికతను సంతరించుకుంటోంది.. మత మౌఢ్యం నెమ్మదిగా తగ్గుతోంది.. అక్షరాస్యత పెరుగుతోంది..

సెక్యూలర్‌ దేశంగా మారుతున్న ఇరాన్‌
Follow us

|

Updated on: Sep 18, 2020 | 5:11 PM

ఇరాన్‌ మునుపటి ఇరాన్‌ కాదు.. ఆ దేశం అభివృద్ధి సాధించడంతో పాటు ఆధునికతను సంతరించుకుంటోంది.. మత మౌఢ్యం నెమ్మదిగా తగ్గుతోంది.. అక్షరాస్యత పెరుగుతోంది.. ఫలితంగా ప్రజల ఆలోచనలలో మార్పు వస్తోంది.. అన్నింటికంటే ముఖ్యం జనాభా వృద్ధి రేటు తగ్గడం.. ఇరాన్‌ నెమ్మది నెమ్మదిగా సెక్యూలర్‌ కంట్రీగా మారబోతున్నదా? ముస్లిం దేశంగా మనుగడ సాగించే అవకాశాలు లేవా? నిజంగానే అక్కడ ముస్లింల ప్రాబల్యం తగ్గుతూ వస్తోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెప్పాలి. కారణం ఆ దేశంలో పరిస్థితులు అలా ఉన్నాయి.. మొన్నీమధ్య అంటే మూడు నెలల కిందట గ్రూప్‌ ఫర్‌ అనలైజింగ్ అండ్‌ మెజరింగ్‌ అటిట్యూడ్స్‌ ఇన్‌ ఇరాన్‌(గమాన్‌) అనే సంస్థ లాడన్‌ బోరౌమాండ్‌ సహకారంతో ఓ ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించింది.. ఆ సర్వేలో బోలెడన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసొచ్చాయి. తమది షియా ముస్లిం దేశంగా ఇరాన్‌ చెప్పుకుంటుంది కానీ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి.. అక్కడ తిప్పికొడితే షియా ముస్లింలు ఉన్నది 32 శాతమేనట! సున్నీ ముస్లింల సంఖ్య అయితే అయిదు శాతానికి మించి లేదట! మూడు శాతం సూఫీ ముస్లింలు ఉన్నారు.. సూఫీలది భిన్నమైన శైలి.. మొత్తం కలిపితే ముస్లింల సంఖ్య 40 శాతమే! సరే… మరి మిగతావారు ఏ మతాన్ని అవలంబిస్తున్నారో.. వారిది ఏ అభిమతమో కూడా తెలుసుకుందాం! తొమ్మిది శాతం మంది ఏ భేషజాలు లేకుండా నాస్తికులమని చెప్పుకున్నారు. ఏడు శాతం మంది తాము ఆధ్యాత్మికవాదులమన్నారు. ఇరాన్‌లో ఎనిమిది శాతం మంది జొరాస్ట్రియన్లు ఉన్నారు.. క్రైస్తవుల సంఖ్య మరీ తక్కువ.. ఒకటిన్నర శాతం మించి లేరు. ఇక ఇప్పుడు మొత్తం ఇరాన్‌ జనాభాలో ఎవరు ఎలాంటి నమ్మకాలతో ఉన్నారో కూడా తెలుసుకుందాం! 78 శాతం మందికి భగవంతుడిపై నమ్మకం ఉంది.. ఇంకా వీరిలో 37 శాతం మందికి పునర్జన్మలపై నమ్మకం ఉంది.స్వర్గనరకాలు అనేవి కచ్చితంగా ఉంటాయని విశ్వసిస్తున్నవారు ఓ 30 శాతం మంది ఉన్నారు. పాపం చేసిన వారు నరకానికి, పుణ్యం చేసినవారు స్వర్గానికి వెళతారన్నది వారి విశ్వాసం. భగవంతుడనేవాడు ఉన్నాడో లేడో తెలియదు కానీ, ఈ సకలచరాచరసృష్టిని ఏదో ఒక మానవాతీత శక్తి నడిపిస్తుందన్నది పాతికశాతం మంది చెబుతున్న మాట! 20 శాతం మంది మాత్రం తాము దేవుడిని నమ్మమని, నాస్తికులమని చెప్పారు.. ఇప్పుడున్న మతాన్ని వదిలేసి కొత్తమతాన్ని పుచ్చుకోవాలని ఉందని ఆరుశాతం మంది చెప్పారు. ఇతర మతాల నుంచి క్రైస్తవ మతంలోకి మారుతున్న వారిలో యువతే ఎక్కువగా ఉంది. ఈ లెక్కలన్నీ చూస్తే ఇరాన్‌ అడుగులు లౌకికవాదం వైపు వెళుతున్నట్టుగా అనిపిస్తోంది.

పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.