Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ పాలిటిక్స్‌‌లో ఓ ఐపీఎస్ కలకలం.. కేసీఆర్ సీరియస్

ips officer in telangana politics, తెలంగాణ పాలిటిక్స్‌‌లో ఓ ఐపీఎస్ కలకలం.. కేసీఆర్ సీరియస్

తెలంగాణ రాజకీయాల్లో ఓ ఐపీఎస్ అధికారి పేరు కలకలం సృష్టిస్తోంది. ఐపీఎస్ హోదాను, అధికారిక బాధ్యతలను వదిలేసి తెలంగాణ కేబినెట్‌లోకి ఎంటరరవుతారంటూ జరిగిన ప్రచారం చివరికి కేసీఆర్ సీరియస్ అయ్యే దాకా వెళ్ళింది. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఐపీఎస్ అధికారి తెలంగాణ కేబినెట్‌లో మంత్రిగా చేరతారంటూ ప్రచారం మొదలైంది. కేబినెట్‌లో చేరడమే కాదు ఏకంగా కేటీఆర్ నిర్వహిస్తున్న ఐటీ శాఖను చేపడతారన్నది సదరు వదంతి సారాంశం. అయితే ఇపుడీ ప్రచారం బూమరాంగ్ అయ్యింది.

కేసీఆర్‌ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తారన్న వార్త ఇటీవల వైరల్ అయ్యింది. రాజకీయాలతో సంబంధం లేని ఓ ఫేస్‌ కేబినెట్‌లోకి వస్తుందని…ఆయనకు ఐటీ ఇస్తారని ప్రచారం జరిగింది. ఇంతకీ ఈ క్యాంపెయిన్‌ వెనుక అసలు ఏం జరిగింది? ఆ పోలీసు అధికారి తెలంగాణ రాజకీయాలతో ఏం సంబంధం? వదంతి ప్రారంభం కాగానే దాని వెనుకున్న లోతుపాతులను కూపీ లాగడం మీడియా వంతైంది. ఈ నేపథ్యంలోనే అసలు వెలుగులోకి వచ్చింది.

మలయాళం భాషకు చెందిన ప్రముఖ వెబ్‌సైట్‌లో ఫస్ట్‌ ఈ వార్త వచ్చింది. కేరళ కేడర్‌కు చెందిన తెలుగు ఐపీఎస్ అధికారి జి. లక్ష్మణ్ త్వరలోనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ కేబినెట్‌లో చేరబోతున్నారు. ఇది వార్త సారాంశం. ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మణ్… గతంలోనే రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆయన తెలంగాణ కేబినెట్‌లోకి రాబోతున్నారనే ఆన్‌మనోరమ మీడియా కథనం సంచలనం సృష్టిస్తోంది. మంత్రివర్గంలోకి చేరడానికి ముందే లక్ష్మణ్ టీఆర్ఎస్‌లో చేరతారని… ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు తెలియజేశారని ఈ కథనంలో పేర్కొన్నారు.

1997 బ్యాచ్‌కు చెందిన లక్ష్మణ్… మాజీ డీజీపీ డి.టి నాయక్‌ అల్లుడు. కేరళ కేడర్‌ అధికారి. 2009 నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించారు. కానీ ఆయన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. అలాంటాయన ఇప్పుడు ఏకంగా మంత్రివర్గంలో చేరబోతున్నారని మనోరమ పత్రికలో కథనం వచ్చింది. మరో 14 ఏళ్ల సర్వీసు ఉన్నప్పటికీ తన పదవికి రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఒక్కసారిగా ఈ వార్త హల్‌చల్‌ కావడం వెనుక ఎవరున్నారు అనే విషయంపై తెలంగాణ నిఘా వర్గాలు సమాచారం సేకరించాయి,

మనోరమ ఆన్‌లైన్‌లో సైట్‌లో ఈ వార్త మొదట కనిపిస్తే.. ఆ తర్వాత తెలుగు వెబ్‌సైట్లలో ఈ వార్త హల్‌చల్‌ చేసింది. నిఘా వర్గాలు చెబుతున్న ప్రకారం లక్ష్మణ్‌ తన పదవి గురించి వార్త ఆయనే స్వయంగా రాయించుకున్నారట. తన రాజకీయ ప్రవేశం గురించి తెలంగాణ చర్చ జరిగేందుకు ఆయన ఈ ఎత్తుగడ వేశారని ఓ ప్రచారం నడుస్తోంది. మొత్తానికి కేరళ ప్రభుత్వానికి ఈ విషయంలో తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని కోరినట్లు తెలిసింది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో లక్ష్మణ్‌ హాట్‌ టాపిక్‌ అయ్యారు.

Related Tags