మారుతున్న పరిస్థితులు.. అక్టోబర్‌లో ఐపీఎల్

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2020కి రూట్ క్లియర్ అయ్యింది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎర్ల్ ఎడ్డింగ్స్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చని అని అనడమే ఇందుకు కారణం. అయితే ప్రపంచ కప్ వాయిదా పడితే అదే సమయంలో ఐపీఎల్ నిర్వహించాలనుకుంటున్న బీసీసీఐకి ఇది కలిసివచ్చే ఛాన్స్. టీ20 ప్రపంచకప్ వాయిదాపై నిర్ణయాన్ని ఐసీసీ తీసుకోవ్సలి ఉంది. ఈ మెగాటోర్నీ నిర్ణయం వచ్చే […]

మారుతున్న పరిస్థితులు.. అక్టోబర్‌లో ఐపీఎల్
Follow us

|

Updated on: Jun 16, 2020 | 7:58 PM

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2020కి రూట్ క్లియర్ అయ్యింది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎర్ల్ ఎడ్డింగ్స్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చని అని అనడమే ఇందుకు కారణం. అయితే ప్రపంచ కప్ వాయిదా పడితే అదే సమయంలో ఐపీఎల్ నిర్వహించాలనుకుంటున్న బీసీసీఐకి ఇది కలిసివచ్చే ఛాన్స్.

టీ20 ప్రపంచకప్ వాయిదాపై నిర్ణయాన్ని ఐసీసీ తీసుకోవ్సలి ఉంది. ఈ మెగాటోర్నీ నిర్ణయం వచ్చే నెలలో తీసుకుంటామని ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. ఐసీసీ తీసుకునే నిర్ణయం మరో నెల రోజుల తర్వాత కవాటం.. అప్పటి వరకు భారత్‌లో కరోన వ్యాప్తి నిలిచిపోతే క్రికెట్ ఫ్యాన్స్‌ పండుగ రోజులు ప్రారంభమైనట్లే అని చెప్పుకోవచ్చు.

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు టీ20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉండగా.. కొవిడ్-19 ప్రభావంతో టోర్నీ నిర్వహణపై గందరగోళం నెలకొంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పలుమార్లు ఈ మెగాటోర్నీ నిర్వహణపై చర్చించింది. ఇదిలావుంటే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సీఈవో కెవిన్ రాబర్ట్స్ తన పదవికి రాజీనామ చేశారు. కెవిన్ స్థానంలో టీ20 ప్రపంచకప్ సీఈవో నిక్ హాక్లీని తాత్కాలిక సీఈవోగా నియమించింది.