ఐపీఎల్ వేలం: ఈ ఆస్ట్రేలియా ఆటగాళ్ల ధర తెలిస్తే మైండ్ బ్లాంకే..!

ఐపీఎల్ వేలంలో అనుభవం ఉన్న ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. గురువారం నిర్వహించిన వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లపై యాజమాన్యలు దృష్టి పెట్టాయి. ఆ దేశ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్‌ను కొనేందుకు గట్టి పోటీ నెలకుంది. ఫైనల్‌గా రూ 15.50 కోట్లకు కమ్మిన్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. 2 కోట్ల బేస్ ప్రైజ్‌తో స్టార్టయిన ఇతగాడు..అత్యంత భారీ ధరకు అమ్ముడైన విదేశీ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా ఆల్‌టైం ఫేవరెట్ ఆల్‌రౌండర్ గ్లెన్ […]

ఐపీఎల్ వేలం: ఈ ఆస్ట్రేలియా ఆటగాళ్ల ధర తెలిస్తే మైండ్ బ్లాంకే..!
Follow us

|

Updated on: Dec 19, 2019 | 6:58 PM

ఐపీఎల్ వేలంలో అనుభవం ఉన్న ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. గురువారం నిర్వహించిన వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లపై యాజమాన్యలు దృష్టి పెట్టాయి. ఆ దేశ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్‌ను కొనేందుకు గట్టి పోటీ నెలకుంది. ఫైనల్‌గా రూ 15.50 కోట్లకు కమ్మిన్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. 2 కోట్ల బేస్ ప్రైజ్‌తో స్టార్టయిన ఇతగాడు..అత్యంత భారీ ధరకు అమ్ముడైన విదేశీ ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

ఇదే క్రమంలో ఆస్ట్రేలియా ఆల్‌టైం ఫేవరెట్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అదిరిపోయే రేటును అందుకున్నాడు. ఏకంగా రూ.10.75 కోట్లు చెల్లించి కింగ్స్ లెవన్ పంజాబ్ అతడిని దక్కించుకుంది. మాక్స్‌వెల్ కోసం.. పంజాబ్,  ఢిల్లీ తెగ ఫోటీ పడ్డాయి. దీంతో బిడ్డింగ్ అంతకంతకూ పెరిగిపోయి రూ. 10 కోట్లను దాటింది.  రూ. 42.70 కోట్లతో వేలంలోకి అడుగుపెట్టిన పంజాబ్.. అందులో రూ. 10 కోట్లను మాక్స్‌వెల్ కోసమే వెచ్చించిందంటే..యాజమాన్యం అతనిపై ఎంత నమ్మకాన్ని పెట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక మరో ఆస్ట్రేలియా ఆటగాడు నాథన్ కౌంటర్ నైల్‌ను రూ 8 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.

ఇక వేలంలో అమ్ముడైన పలువురు ఆటగాళ్ల వివరాలు :

ఇయాన్ మోర్గాన్ : రూ 5.25 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లు)

ఊతప్పను 3 కోట్లకు దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్ (బేస్ ప్రైజ్ బేస్ రూ. 1.5 కోట్లు)

క్రిస్ లిన్‌ను 2 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్

ఆరోన్ ఫించ్ ను 4.40 కోట్లకు దక్కించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ( బేస్ ప్రైజ్ రూ. 1 కోటి)

వెస్టిండీస్ ప్లేయర్  షెల్డన్ కాట్రెల్‌ను రూ  8.50 కోట్లకు పంజాబ్ యాజమాన్యం కొనుగోలు చేసింది.