ఐపీఎల్ 2021 వేలం పాట.. స్టీవ్ స్మిత్‌ను వదులుకోనున్న రాజస్థాన్ రాయల్స్.. మరి చెన్నై సిద్దమేనా.!

IPL 2021: ఐపీఎల్ 2021 మినీ వేలంలో భాగంగా బీసీసీఐ విధించిన డెడ్‌లైన్ దగ్గర పడుతుండటంతో ఫ్రాంచైజీలు రిలీజ్ చేసే ఆటగాళ్ల లిస్టును…

  • Ravi Kiran
  • Publish Date - 6:47 pm, Wed, 13 January 21
IPL 2021 Mini Auction

IPL 2021 Mini Auction: ఐపీఎల్ 2021 మినీ వేలంలో భాగంగా బీసీసీఐ విధించిన డెడ్‌లైన్ దగ్గర పడుతుండటంతో ఫ్రాంచైజీలు రిలీజ్ చేసే ఆటగాళ్ల లిస్టును సిద్దం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది ఐపీఎల్‌లో చివరి స్థానానికి పరిమితమైన రాజస్థాన్ రాయల్స్ వదులుకునే ప్లేయర్స్ జాబితాను సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

అనూహ్యంగా అందులో కెప్టెన్ స్టీవ్ స్మిత్ పేరు ఉందని సమాచారం. అతనితో పాటు మరో నలుగురు ఆటగాళ్లను విడిచిపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ స్మిత్‌ను రాజస్థాన్ వదులుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ వేలం పొందనున్నట్లు సమాచారం. కాగా, తమ జట్లలో కొనసాగే ఆటగాళ్లు ఎవరన్న జాబితాను ఫ్రాంచైజీలందరూ ఈ నెల 20వ తేదీ లోగా సమర్పించాల్సి ఉందని బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Also Read: ఐపీఎల్ 2021 మినీ వేలం.. చెన్నై సూపర్ కింగ్స్ విడిచిపెట్టే ప్లేయర్స్ జాబితా ఇదే.!