ఐపీఎల్ 2021: మినీ ఆక్షన్‌కు రంగం సిద్దం.! వేలంలోకి గేల్, స్మిత్, రహనే, రైనా‌లు వచ్చే అవకాశం..

IPL 2021: ఐపీఎల్ 2021పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఈ నేపధ్యంలోనే ఫిబ్రవరి మొదటి వారంలో మినీ ఆక్షన్ నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది.

  • Ravi Kiran
  • Publish Date - 4:59 pm, Thu, 14 January 21
IPL 2021
IPL 2021

IPL 2021: ఐపీఎల్ 2021పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఈ నేపధ్యంలోనే ఫిబ్రవరి మొదటి వారంలో మినీ ఆక్షన్ నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే జనవరి 20వ తేదీలోగా వేలం కోసం రిలీజ్ చేసే ఆటగాళ్లు, తమ జట్టులో ఉండే ప్లేయర్స్ లిస్టును సిద్దం చేయాలని ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రణాళికలు ఫ్రాంచైజీలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఇక టీమ్‌ల వారీగా రిలీజ్ చేసే ప్లేయర్స్ లిస్ట్ ఇలా ఉండబోతోందని అంచనా..

ముంబై ఇండియన్స్:

కృనాల్ పాండ్యా, క్రిస్ లిన్, రాహుల్ చాహర్, మిచెల్ మెక్లేగహన్, దవల్ కులకర్ణి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

ఉమేష్ యాదవ్, ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, మొయిన్ అలీ

ఢిల్లీ క్యాపిటల్స్:

పృథ్వీ షా, అజింక్య రహానే, హెట్మెయర్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా

సన్‌రైజర్స్ హైదరాబాద్:

మనీష్ పాండే, విజయ్ శంకర్, మహమ్మద్ నబీ, ఖలీల్ అహ్మద్, జానీ బెయిర్‌స్టో

రాజస్థాన్ రాయల్స్:

స్టీవ్ స్మిత్, రాబిన్ ఉతప్ప, డేవిడ్ మిల్లర్, టామ్ కుర్రాన్, జయదేవ్ ఉనద్కట్

కోల్‌కతా నైట్ రైడర్స్:

దినేష్ కార్తీక్, ప్యాట్ కమిన్స్, కుల్దీప్ యాదవ్, రసెల్, కమలేశ్ నాగర్‌కోటి

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:

మాక్స్‌వెల్, క్రిస్ గేల్, కాట్రెల్, కరుణ్ నాయర్, మనదీప్ సింగ్

చెన్నై సూపర్ కింగ్స్:

సురేష్ రైనా, కేదార్ జాదవ్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, ఇమ్రాన్ తాహీర్, లుంగి ఎనిగిడి