ఒక బాల్‌, రెండు రివ్యూలు- హైదరాబాద్‌, పంజాబ్‌ మ్యాచ్‌లో విచిత్ర ఘటన

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో నిన్న దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓ విచిత్రం జరిగింది.. పంజాబ్‌ బ్యాట్సమన్‌ ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌ ఆ విచిత్రంలో ప్రధానపాత్రధారి...!

  • Balu
  • Publish Date - 12:03 pm, Fri, 9 October 20
ఒక బాల్‌, రెండు రివ్యూలు- హైదరాబాద్‌, పంజాబ్‌ మ్యాచ్‌లో విచిత్ర ఘటన

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో నిన్న దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓ విచిత్రం జరిగింది.. పంజాబ్‌ బ్యాట్సమన్‌ ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌ ఆ విచిత్రంలో ప్రధానపాత్రధారి…! ఒకే ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు ముజీబ్‌.. ఇందులో విచిత్రం లేకపోయినా ముజీబ్‌ కోసం రెండు రివ్యూలు అమలు చేయాల్సి రావడమే విచిత్రం.. అంటే ఒక్క బంతికే రెండు రివ్యూలు అన్నమాట! ఐపీఎల్‌లోనే కాదు.. అసలు టీ-20 ఫార్మట్‌లోనే ఇలాంటి ఇన్సిడెంట్‌ జరగలేదు.. 14వ ఓవర్‌లో కీపర్‌ బెయిన్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చాడు ముజీబ్‌.. అయితే ఆ బంతి బ్యాట్‌కు తాకిందా లేదా అన్న అనుమానం అంపైర్లకు వచ్చింది..తొలుత అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రివ్యూ కూడా అడగలేదు.. ఎందుకో అంపైర్లిద్దరికి మళ్లీ అనుమానం వచ్చింది. వారు మూడో అంపైర్‌ను సంప్రదించారు. బాల్‌ నేలను తాకిందా లేదా అనే దానిపై మాత్రమే సమీక్షించిన థర్డ్‌ అంపైర్‌ అవుట్‌గా ప్రకటించాడు.. నిరాశగా మైదానం వీడుతున్న ముజీబ్‌కు డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి ఎవరో రివ్యూకు వెళ్లమని చెప్పారు. ముజీబ్‌ సమీక్ష కోరడంతో మళ్లీ సమీక్ష జరిపారు.. అల్ట్రాఎడ్జ్‌లో బాల్‌ బ్యాట్‌ అంచుకు తాకినట్టు అనిపించింది.. మూడో అంపైర్‌ మరోసారి అవుట్‌ ఇచ్చాడు.. పంజాబ్‌కు ఒక రివ్యూ వృధా అయితే అయ్యింది కానీ… ఈ ఇన్సిడెంట్‌ మాత్రం క్రికెట్‌ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది..