రెండు జట్ల నెట్‌ రన్‌రేట్‌ సమంగా ఉంటే ఏం జరుగుతుంది?

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నమెంట్‌ చివరాంకానికి వచ్చేసింది.. మంగళవారం ముంబాయి ఇండియన్స్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌తో లీగ్‌ దశ ముగుస్తుంది.. ఆ తర్వాతే ప్లే ఆఫ్స్‌కు చేరుకునే జట్లపై ఓ క్లారిటీ వస్తుంది. హైదరాబాద్‌కు ఇది డూ ఆర్‌ డై మ్యాచ్‌.. గెలిస్తేనే బరిలో ఉంటుంది.. లేకపోతే లేదు. చెన్నై సూపర్‌ కింగ్స్‌, కింగ్స్‌ పంజాబ్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ ఇప్పటికే ఇంటిదారిపట్టాయి.. ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్‌లో బెర్త్‌ కన్‌ఫామ్‌ చేసుకున్న […]

రెండు జట్ల నెట్‌ రన్‌రేట్‌ సమంగా ఉంటే ఏం జరుగుతుంది?
Follow us

|

Updated on: Nov 02, 2020 | 5:52 PM

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నమెంట్‌ చివరాంకానికి వచ్చేసింది.. మంగళవారం ముంబాయి ఇండియన్స్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌తో లీగ్‌ దశ ముగుస్తుంది.. ఆ తర్వాతే ప్లే ఆఫ్స్‌కు చేరుకునే జట్లపై ఓ క్లారిటీ వస్తుంది. హైదరాబాద్‌కు ఇది డూ ఆర్‌ డై మ్యాచ్‌.. గెలిస్తేనే బరిలో ఉంటుంది.. లేకపోతే లేదు. చెన్నై సూపర్‌ కింగ్స్‌, కింగ్స్‌ పంజాబ్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ ఇప్పటికే ఇంటిదారిపట్టాయి.. ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్‌లో బెర్త్‌ కన్‌ఫామ్‌ చేసుకున్న జట్టు ముంబాయి ఇండియన్స్‌ ఒక్కటే.. రెండు, మూడు, నాలుగు ప్లేసులలో ఎవరుంటారనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ముంబాయి ఇండియన్స్‌పై హైదరాబాద్ గెలిస్తే డైరెక్ట్‌గా ప్లే ఆఫ్స్‌కు వెళ్లిపోతుంది. ఇక ఇవాళ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, డిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌ రెండు జట్లకు కీలకమే! గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.. అలాగని ఓడిన జట్టు ఇంటిదారి పట్టాల్సిన అవసరం లేదు.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో టాప్‌ ఫోర్‌లో ఉన్న జట్లను పరిశీలిస్తే ముంబాయి మినహా మిగిలిన మూడు జట్ల నెట్‌ రన్‌రేటు మైనస్‌లో ఉంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు నెట్‌ రన్‌రేట్‌ మైనస్‌ 0.145గా ఉంది.. ఢిల్లీ క్యాపిటల్స్‌ నెట్‌ రన్‌రేటు మైనస్‌ 0.159గా ఉంది. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నెట్‌ రన్‌రేట్‌ మైనస్‌ 0.214గా ఉంది.. అంటే కోల్‌కతా నెట్‌ రన్‌రేట్‌ ఏమంతా బాగోలేదు. రేపు జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ గెలవకపోతేనే కోల్‌కతాకు ఛాన్స్‌.. లేకపోతే ఇంటికే! ఎందుకంటే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు నెట్‌ రన్‌రేట్‌లో ముంబాయి తర్వాతి ప్లేస్‌లో ఉంది.. కాబట్టి కాసింత ఒళ్ల జాగ్రత్తగా పెట్టుకుని రేపటి మ్యాచ్‌ గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు వెళుతుంది. క్రికెట్‌లో ఏమైనా జరగవచ్చు కాబట్టి నెట్‌ రన్‌రేట్‌ కూడా సమంగా ఉంటే అప్పుడేం చేస్తారో తెలుసుకుందాం! ఇలాంటి పరిస్థితి రాకపోవచ్చు కానీ వస్తే మాత్రం ఏ జట్టు ఎక్కువ వికెట్లు తీసుకుంటుందో ఆ జట్టును ప్లే ఆఫ్స్‌కు పంపుతారు. ఒకవేళ తీసుకున్న వికెట్లు కూడా సమంగా ఉంటే అప్పుడు డ్రా తీస్తారు.