ముంబాయి ఇండియన్స్‌తో రాజస్తాన్‌ రాయల్స్ పోరు

ఐపీఎల్‌ టోర్నమెంట్‌ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.. ఊహించని ఫలితాలు వస్తున్నాయి.. దాదాపు మ్యాచులన్నీ ఉత్కంఠభరితంగానే సాగుతున్నాయి..

ముంబాయి ఇండియన్స్‌తో రాజస్తాన్‌ రాయల్స్ పోరు
Follow us

|

Updated on: Oct 06, 2020 | 3:31 PM

ఐపీఎల్‌ టోర్నమెంట్‌ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.. ఊహించని ఫలితాలు వస్తున్నాయి.. దాదాపు మ్యాచులన్నీ ఉత్కంఠభరితంగానే సాగుతున్నాయి.. మరికాసేపట్లో అబుదాబిలో జరగబోయే ముంబాయి ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ కూడా ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు 20 సార్లు తలపడితే రెండు జట్లు చెరో పది విజయాలు సాధించాయి.. గత అయిదు మ్యాచ్‌లను చూస్తే నాలుగింటిలో రాజస్తాన్‌ రాయల్స్‌ టీమే గెలిచింది.. ముంబాయి ఇండియన్స్‌ కేవలం ఒక మ్యాచ్‌లోనే విజయం సాధించింది.. అలాగని ముంబాయి జట్టును తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే బలమైన జట్లను అది ఓడించింది.. చక్కటి ఆల్‌రౌండ్‌ ప్రతిభను కనబరుస్తోంది.. ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచులలో మూడింటిలో విజయం సాధించింది.. అయిదో కప్‌ సాధించడం కోసం ఆరాటపడుతోంది. చెన్నైతో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ మరుసటి మ్యాచ్‌కే పుంజుకోగలిగింది. మరోవైపు రాజస్తాన్‌ రాయల్స్‌ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతోంది. ఈ మ్యాచ్‌కైనా వస్తాడనుకున్న ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ ఇంకా క్వారంటైన్‌లో ఉండటం రాజస్తాన్‌కు ఒకింత మైనస్సే! ఇక సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాబిన్‌ ఊతప్ప ఫామ్‌ కోసం అష్టకష్టాలు పడుతున్నాడు.. పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు.. ఈ విషయంలోనూ రాజస్తాన్‌ కాసింత ఆందోళన చెందుతోంది. ముంబాయితో జరిగే మ్యాచ్‌ కీలకం కాబట్టి ఊతప్పను డ్రాప్‌ చేసి అతని స్థానంలో యశస్వీ జైస్వాల్‌ను ఆడించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఎందుకంటే జైస్వాల్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు కనుక! పేసర్లకు అనుకూలించే అబుదాబి పిచ్‌పై రాజస్తాన్‌ తుది జట్టు ఎలా ఉంటుందో చూడాలి.. ఎక్స్‌ట్రా పేసర్‌ను తీసుకుంటుందా లేక లాస్ట్‌ మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలో దిగుతుందా అన్నది ఆసక్తిగా మారింది..

ముంబై ఇండియన్స్‌ రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్, ఆదిత్య తారే, సౌరభ్‌ తివారి, జస్‌ప్రీత్‌ బుమ్రా, ధవల్‌ కులకర్ణి, జయంత్‌ యాదవ్, సూర్యకుమార్‌ యాదవ్, కృనాల్‌ పాండ్యా, రాహుల్‌ చహర్, హార్దిక్‌ పాండ్యా, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్, మొహసిన్‌ ఖాన్, బల్వంత్‌రాయ్‌ సింగ్, అనుకూల్‌ రాయ్, ఇషాన్‌ కిషన్‌ (భారత ఆటగాళ్లు). క్వింటన్‌ డి కాక్, జేమ్స్‌ ప్యాటిన్సన్, నాథన్‌ కూల్టర్‌ నీల్, ట్రెంట్‌ బౌల్ట్, పొలార్డ్, క్రిస్‌ లిన్, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్, మెక్లీనగన్‌ (విదేశీ ఆటగాళ్లు).

రాజస్తాన్‌ రాయల్స్‌ స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), బెన్‌ స్టోక్స్, ఆండ్రూ టై, ఒషాన్‌ థామస్, జోఫ్రా ఆర్చర్, డేవిడ్‌ మిల్లర్, జాస్‌ బట్లర్, టామ్‌ కరన్‌ (విదేశీ ఆటగాళ్లు). సంజు శామ్సన్, కార్తీక్‌ త్యాగి, అంకిత్‌ రాజ్‌పుత్, శ్రేయస్‌ గోపాల్, రాహుల్‌ తేవటియా, ఉనాద్కట్, మయాంక్‌ మర్కండే, మహిపాల్‌ లోమ్రోర్, రియాన్‌ పరాగ్, యశస్వి జైస్వాల్, అనూజ్‌ రావత్, ఆకాశ్‌ సింగ్, మనన్‌ వోహ్రా, శశాంక్‌ సింగ్, వరుణ్‌ ఆరోన్, రాబిన్‌ ఉతప్ప, అనిరుధ జోషి (భారత ఆటగాళ్లు)