నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య పోరు

ప్రేక్షకుల కేరింతలు లేకుండా ఖాళీ స్టేడియంలలో జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోని మ్యాచ్‌లు ఆరంభంలో అదో రకంగా అనిపించినా .. క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడిప్పుడే ఆ సరికొత్త అనుభవానికి అడ్జెస్ట్‌ అవుతున్నారు..

  • Balu
  • Publish Date - 3:39 pm, Sat, 26 September 20
నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య పోరు

ప్రేక్షకుల కేరింతలు లేకుండా ఖాళీ స్టేడియంలలో జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోని మ్యాచ్‌లు ఆరంభంలో అదో రకంగా అనిపించినా .. క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడిప్పుడే ఆ సరికొత్త అనుభవానికి అడ్జెస్ట్‌ అవుతున్నారు.. ఇవాళ జరగబోయే మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారా అన్నదానిపై లెక్కలు కూడా వేసుకుంటున్నారు.. నిజమే.. మరి కొద్ది గంటల్లో జరగబోయే ఆ మ్యాచ్‌పై అందరికీ ఆసక్తి ఉంది.. కారణం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తలపడుతుండటమే! ఈ రెండు జట్లు తమ తమ ఆరంభ మ్యాచ్‌లలో ఓటమే ఎదురయ్యింది.. అబుదాబిలోని షేక్‌ జాయెద్‌ క్రికెట్‌ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్‌లో ఫలానా జట్టు గెలుస్తుందని గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి… ఎందుకంటే రెండు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి..
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వాతావరణానికి అలవాటు పడటం కష్టమే! రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మొదటి మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఆట తీరే ఇందుకు నిదర్శనం..ఆటగాళ్ల రనౌట్లు, గాయాలు గెలుపుకు అవరోధంగా నిలిచాయి.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ వార్నర్‌ అసహజరీతిలో రనౌట్‌ కావడం హైదరాబాద్ అభిమానులకు నిరాశ కలిగించింది.. విలియమ్‌సన్‌ గాయమే హైదరాబాద్‌ జట్టకు దెబ్బ అనుకుంటే… చీలమండ గాయంతో ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ ఐపీఎల్‌ నుంచే నిష్ర్కమించడం సన్‌రైజర్స్‌ కాన్ఫినెన్స్‌పై కోత పెట్టినట్టయింది.. ఇక మిడిల్‌ఆర్డర్‌ వైఫల్యం గురించి ఎంత చెప్పినా తక్కువే! తొలి బంతికే విజయ్‌శంకర్‌ అవుటవ్వడమనేది కచ్చితంగా అతడి అనుభవ రాహిత్యమే! ప్రియమ్‌గార్గ్‌ చేజేతులా వికెట్‌ పారేసుకున్నాడు.. ఇలాగే ఆడితే మాత్రం హైదరాబాద్‌కు గెలుపు కష్టమే! పోనీ బౌలర్లయినా చక్కగా రాణిస్తున్నారా అంటే అదీ లేదు. రషీద్‌ఖాన్‌, భువనేశ్వర్‌లకు ఒక్క వికెట్‌ కూడా రాకపోవడం ఆశ్చర్యమే! సందీప్‌శర్మ, నటరాజన్‌లు బౌలింగ్‌ ఫర్వాలేదు.. టాప్‌ ఆర్డర్‌లో జానీ బెయిర్‌స్టో, మనీశ్‌పాండేలు బాగానే ఆడారు.. కానీ విజయానికి ఆ ఆట సరిపోదు.. ప్రియాంగార్గ్‌, విజయ్‌శంకర్‌, అభిషేక్‌ శర్మ పూర్తి ఎఫర్ట్ పెట్టి ఆడాల్సి ఉంటుంది.. ఇక కేన్‌ విలియమ్‌సన్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడో లేదో తెలియదు.. విలియమ్‌సన్‌ అందుబాటులో ఉంటే ఫర్వాలేదు.. లేకపోతే అతడి స్థానంలో అఫ్ఘనిస్తాన్‌ ఆల్‌రౌండ్‌ మహ్మద్‌ నబీకి చోటు దక్కవచ్చు.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టీమ్‌ పరిస్థితి హైదరాబాద్‌కేమీ తీసిపోదు.. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌కు ఈ మ్యాచ్‌ నిజంగానే ఓ సవాల్‌.. ముంబాయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అనేక పొరపాట్లు చేశాడు.. ఈ మ్యాచ్‌లో అలాంటి తప్పిదాలు చేయకుండా వ్యూహాలు మార్చుకోవలసి ఉంటుంది.. ఎడాపెడా బాదేసే రసెల్‌, ఇయాన్‌ మోర్గాన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మారిస్తే బాగుంటుంది.. టాప్‌ ఆర్డర్‌లో తీసుకొస్తే స్వేచ్ఛగా ఆడే అవకాశం వారికి లభిస్తుంది.. లేకపోతే అనవసరమైన ఒత్తిడిని వారు ఎదుర్కోవలసి వస్తుంది.. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌కు చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది.. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌పై జట్టు ఎద్ద ఆశలే పెట్టుకుంది.. బౌలింగ్‌లో పేస్‌బౌలర్‌ శివంమావి బాగానే రాణించాడు.. ఇకపోతే నిఖిల్ నాయక్‌ను కొనసాగిస్తారా లేక అతడి స్థానంలో రాహుల్‌ త్రిపాఠిని తీసుకుంటారా అన్నది చూడాలి. రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 17 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్‌ పది మ్యాచ్‌ల్లో గెలుపొందింది.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఏడు మ్యాచ్‌లలో గెలిచింది.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌
దినేశ్‌ కార్తీక్‌ (కెప్టెన్‌), శివమ్‌ మావి, సందీప్‌ వారియర్, కుల్దీప్‌ యాదవ్, నిఖిల్‌ నాయక్, సిద్ధార్థ్, ప్రసిధ్‌ కృష్ణ, శుబ్‌మన్‌ గిల్, నితీశ్‌ రాణా, సిద్దేశ్‌ లాడ్, కమలేశ్‌ నాగర్‌కోటి, రింకూ సింగ్, వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ త్రిపాఠి (భారత ఆటగాళ్లు). మోర్గాన్, ప్యాట్‌ కమిన్స్, సునీల్‌ నరైన్, రసెల్, లోకీ ఫెర్గూసన్, అలీఖాన్, టామ్‌ బాంటన్, క్రిస్‌ గ్రీన్‌ (విదేశీ ఆటగాళ్లు).

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
డేవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), రషీద్‌ ఖాన్, మిషెల్‌ మార్‌‡్ష, మొహహ్మద్‌ నబీ, ఫాబియాన్‌ అలెన్, బిల్లీ స్టాన్‌లేక్, కేన్‌ విలియమ్సన్, బెయిర్‌స్టో (విదేశీ ఆటగాళ్లు). వృద్ధిమాన్‌ సాహా, సంజయ్‌ యాదవ్, ఖలీల్‌ అహ్మద్, సందీప్‌ శర్మ, అబ్దుల్‌ సమద్, శ్రీవత్స్‌ గోస్వామి, అభిషేక్‌ శర్మ, బాసిల్‌ థంపి, సందీప్‌ బావనక, భువనేశ్వర్, విరాట్‌ సింగ్, టి. నటరాజన్, షహబాజ్‌ నదీమ్, మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్, సిద్ధార్థ్‌ కౌల్, ప్రియమ్‌ గార్గ్‌ (భారత ఆటగాళ్లు).