యువ కెప్టెన్ల మధ్య పోరు.. బలాలు, బలహీనతలు..

ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్ పూర్తయింది. చెన్నై సూపర్ కింగ్స్ సునాయాసంగా విజయం సాధించింది. ఇక ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది.

  • Ravi Kiran
  • Publish Date - 4:13 pm, Sun, 20 September 20
యువ కెప్టెన్ల మధ్య పోరు.. బలాలు, బలహీనతలు..

ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్ పూర్తయింది. చెన్నై సూపర్ కింగ్స్ సునాయాసంగా విజయం సాధించింది. ఇక ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు యువ కెప్టెన్ల మధ్య భీకర పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం సిద్దమైంది. ఈ పిచ్‌పై సీమర్స్‌కు కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (Delhi Vs Punjab Match Preview)

కొత్త కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పంజాబ్ బరిలోకి దిగుతుండగా.. ఆ జట్టుకు మ్యాక్స్‌వెల్‌, గేల్, ముజీబ్ రెహ్మాన్, మయాంక్ అగర్వాల్ లాంటి మంచి ఆటగాళ్లు ఉండగా.. శ్రేయాస్ అయ్యర్ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ ప్లేయర్లు ధావన్, రహనే, అశ్విన్‌లపైన చాలా ఆశలు పెట్టుకుంది. ఇరు జట్లలోనూ యువ ఆటగాళ్లు, సీనియర్ ప్లేయర్స్‌ మేళవింపు పుష్కలంగా ఉంది.

గతంలో పంజాబ్‌కు అశ్విన్ సారధ్యం వహించడంతో.. ఆ జట్టు బలహీనతలు అతడికి ఖచ్చితంగా తెలుస్తాయి. ఇప్పుడు అదే ఢిల్లీకి ప్లస్ పాయింట్ అయ్యేలా కనిపిస్తోంది. ఢిల్లీ జట్టుకు మిడిల్ ఆర్డర్ కొంచెం ఇబ్బందికరమైన అంశం. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ మినహా ఎవరూ కూడా ఇంతవరకు గొప్పగా రాణించలేదు. ఇక ఈ ఏడాది హెట్‌మయర్‌, క్యారీ, స్టోయినిస్, సామ్స్ లాంటి ఆటగాళ్లు ఉండటం వాళ్ళకి కలిసొచ్చే అంశం. అటు పంజాబ్ జట్టు అయితే అన్ని విభాగాల్లోనూ గొప్పగా ఉంది. మరి ఈ రెండు జట్లలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

ఢిల్లీ(అంచనా): ధావన్, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), పంత్(వికెట్ కీపర్), హెట్‌మయర్‌/క్యారీ, స్టోయినిస్, అక్షర పటేల్, అశ్విన్, సామ్స్, నోర్తేజ్, రబాడా

పంజాబ్(అంచనా): రాహుల్(కెప్టెన్), గేల్/పూరణ్, మయాంక్ అగర్వాల్, మ్యాక్స్‌వెల్‌, సర్ఫరాజ్ ఖాన్/ కరణ్ నాయర్, మందీప్ సింగ్, జోర్డాన్, గౌతమ్, షమీ, కాట్రేల్/ ముజీబ్ రెహ్మాన్, రవి బిషనో

Also Read:

మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..