కోలుకున్న గేల్.. బెంగళూరుతో మ్యాచ్‌కు రెడీ

ఐపీఎల్ టోర్నీ ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తున్న తమ అభిమాన బ్యాట్స్‌మన్ బ్యాటింగ్ చూడలేక చతికిలా పడిన గేల్ అభిమానులకిది శుభవార్త. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా పేరున్న...

  • Updated On - 3:30 pm, Wed, 14 October 20 Edited By: Pardhasaradhi Peri
కోలుకున్న గేల్.. బెంగళూరుతో మ్యాచ్‌కు రెడీ

Gayle ready to play with Bangalore: ఐపీఎల్ టోర్నీ ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తున్న తమ అభిమాన బ్యాట్స్‌మన్ బ్యాటింగ్ చూడలేక చతికిలా పడిన గేల్ అభిమానులకిది శుభవార్త. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా పేరున్న విండీస్ వీరుడు క్రిస్ గేల్ ఐపీఎల్ టోర్నీలో మెరుపులు మెరిపించే సమయం ఆసన్నమైంది. గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరగే మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఆడతాడని కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు ప్రకటించింది.

ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యం పాలైన క్రిస్ గేల్ పూర్తిగా కోలుకున్నాడని 2020 ఐపీఎల్ టోర్నీలో అతను ప్రాతినిధ్యం వహిస్తున్న కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు వెల్లడించింది. దాంతో ప్రస్తుత టోర్నీలో తన తొలిమ్యాచ్ గురువారం నాడు ఆడబోతున్నాడని, ముఖ్యంగా బలంగా కనిపిస్తున్న బెంగళూరుతో ఢీకొనే మ్యాచ్‌తో క్రిస్ గేల్ ఆట ప్రారంభించడం ఆనందంగా వుందని జట్టు మేనేజ్‌మెంటు అంటోంది.

ఇప్పటి వరకు పంజాబ్ జట్టు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఆరు ఓడి ప్లే-ఆఫ్ అవకాశాలను జఠిలం చేసుకుంది. ఇప్పట్నించి ఆడే ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితిని కొనితెచ్చుకుంది. ప్రతీ మ్యాచ్ గెలిస్తే ప్లే-ఆఫ్ అవకాశాలు తిరిగి సజీవమవుతాయి. కానీ అదంత సులభం కాదని పంజాబ్ జట్టు యాజమాన్యానికి తెలుసు. కీలక తరుణంలో క్రిస్ గేల్ రంగంలోకి దిగడంతో మళ్ళీ ఆశలు చిగురించినట్లుగా కింగ్స్ లెవెన్ పంజాబ్ అభిమానాలు భావిస్తున్నారు.

Also read: అక్టోబర్ 28న కృష్ణా రివర్ బోర్డు భేటీ

Also read: నవంబర్ 9న రాజ్యసభ ఎన్నికలు