Breaking News
  • కడప: వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలి. బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజద్‌ రాజీనామా చేయాలి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారు-ఆదినారాయణరెడ్డి.
  • రేపు పవన్‌ కల్యాణ్ ఢిల్లీ పర్యటన. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయం సందర్శించనున్న పవన్‌. అమరవీరుల సంక్షేమానికి రూ.కోటి అందించనున్న పవన్‌.
  • కృష్ణాజిల్లా: చందర్లపాడు తహశీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం. పక్కా ఇళ్ల స్థలాలకు తన పొలంలో మట్టి తవ్వుతున్నారని మనస్తాపం. పురుగులమందు తాగబోయిన రైతు, అడ్డుకున్న సిబ్బంది.
  • ప.గో: తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్‌ కాలేజ్ విద్యార్థి మృతి. బైక్‌పై నుంచి పడి మృతిచెందాడంటున్న తండ్రి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.
  • హైదరాబాద్: మిస్టరీగా మారిన ఆయుష్‌ చాన్‌ బే మృతి, ఈనెల 16న స్నేహితుడి పుట్టిన రోజు అని వెళ్లిన ఆయుష్‌, నిన్న రక్తపు మడుగులో శవమై తేలిన ఆయుష్‌, ఆయుష్‌పై మృతిపై అనుమానాలు.
  • విజయవాడ: అక్రమ కట్టడాలపై ఏసీబీ అధికారుల దాడులు. అనధికారిక అనుమతులపై లోతైన విచారణ. అక్రమంగా నిర్మించిన భవన యజమానులపై చర్యలకు సిఫారసు.

ఐపీఎల్‌తో ధోని కెరీర్ ముగుస్తుందిః రవిశాస్త్రి

IPL 2020 To Decide Dhoni Career, ఐపీఎల్‌తో ధోని కెరీర్ ముగుస్తుందిః రవిశాస్త్రి

IPL 2020 To Decide Dhoni Career: ఐపీఎల్ 2020 ప్రదర్శనతోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ కెరీర్‌పై ఓ క్లారిటీ వస్తుందని ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో ధోనికి చోటు దక్కని విషయం తెలిసిందే. అంతేకాక గత కొద్దిరోజులుగా అతడి రిటైర్మెంట్‌పై అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి ధోని భవితవ్యంపై స్పందించడం ఆసక్తికరంగా మారింది. కొందరు ధోని రీ-ఎంట్రీ ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మిస్టర్ కూల్ కెరీర్ ముగిసినట్లేనని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

వన్డే వరల్డ్‌కప్ అనంతరం ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. కొన్ని రోజులు ఆర్మీతో కలిసి దేశ సేవ చేసినా.. తన భవిష్యత్తుపై మాత్రం ఎలాంటి నిర్ణయానికి రాలేదు. అటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి కూడా ధోని పేరును తొలగించడంతో రిటైర్మెంట్ చేసేశాడని అందరూ అనుకున్నారు. అయితే ఇటీవల ఝార్ఖండ్ టీమ్‌తో ధోని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఐపీఎల్ కోసమే శిక్షణ చేస్తున్నట్లు ఝార్ఖండ్ టీమ్ పెద్దలు ధృవీకరించారు.

Related Tags