యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోనే ఎందుకు?

మొత్తానికి క్రికెట్‌ అభిమానుల కోరిక నెరవేరింది.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-ఐపీఎల్‌కు తేదీలు ఖరారయ్యాయి.. ఈ మెగా టోర్నమెంట్‌ను ఈసారి దుబాయ్‌ ఆతిథ్యమివ్వనుంది.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను మరో దేశంలో జరపడానికి కారణాలేమిటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు... కరోనా వైరస్‌ ఏ ఒక్క కార్యక్రమాన్ని సక్రమంగా జరుపుకోనివ్వడం లేదు..

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోనే ఎందుకు?
Follow us

|

Updated on: Jul 24, 2020 | 4:15 PM

మొత్తానికి క్రికెట్‌ అభిమానుల కోరిక నెరవేరింది.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-ఐపీఎల్‌కు తేదీలు ఖరారయ్యాయి.. ఈ మెగా టోర్నమెంట్‌ను ఈసారి దుబాయ్‌ ఆతిథ్యమివ్వనుంది.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను మరో దేశంలో జరపడానికి కారణాలేమిటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు… కరోనా వైరస్‌ ఏ ఒక్క కార్యక్రమాన్ని సక్రమంగా జరుపుకోనివ్వడం లేదు..అయినా 2009లో ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించగా లేనిది ఇప్పుడు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌లో నిర్వహిస్తే బీసీసీఐ గౌరవ మర్యాదలకు వచ్చిన నష్టమేమీ లేదు.. 2009లో సాధారణ ఎన్నికలు రావడమూ, ఆటగాళ్ల భద్రత కల్పించడం కష్టమంటూ ప్రభుత్వం చెప్పడమూ ఏక కాలంలో జరగడంతో గత్యంతరం లేక ఐపీఎల్‌ను సౌతాఫ్రికాలో నిర్వహించాల్సి వచ్చింది.. 2014లో కూడా ఎన్నికలు రావడంతో 20 మ్యాచ్‌లను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరిపిన సంగతి మర్చిపోకూడదు. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం ఐపీఎల్‌ -2020 టోర్నమెంట్‌ యూఏఈలో సెప్టెంబర్‌ 19న ప్రారంభం కానుంది. 51 రోజుల పాటు జరిగే లీగ్‌ ఫైనల్‌ను నవంబర్‌ 8న నిర్వహిస్తారు. లీగ్‌లో పాల్గొంటున్న ఎనిమిది జట్లు కూడా ఆగస్టు 20కల్లా యూఏఈకి చేరుకోనున్నాయి. ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ ఇందుకోసం సిద్ధమవుతున్నాయి.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోనే ఎందుకు నిర్వహిస్తున్నారనే సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో మూడు అధునాతన క్రికెట్‌ మైదానాలు ఉన్నాయి. అబుదాబిలో షేక్‌ జయెద్‌ క్రికెట్‌ స్టేడియం, దుబాయ్‌లో దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం, షార్జాలో షార్జా క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలను ఐపీఎల్‌ కోసం ఆగమేఘాల మీద సిద్ధం చేస్తున్నారు. బీసీసీఐ కూడా ఈ మూడు స్టేడియంలను ఆల్‌రెడీ బుక్‌ చేసేసింది కూడా! పైగా ఒక స్టేడియం నుంచి మరో స్టేడియంకు రోడ్డు మార్గంలో సునాయాసంగా చేరుకోవచ్చు… విమానంలో అటు ఇటు తిరిగే ప్రయాస తప్పుతుంది. రిస్కూ తప్పుతుంది. ఈ మూడు గ్రౌండ్‌లతో పాటు ఆటగాళ్ల శిక్షణకు, నెట్‌ ప్రాక్టీసు కోసం ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌ను కూడా రెంట్‌కు తీసుకుంటోంది బీసీసీఐ. మరి స్టేడియంలో ప్రేక్షకులను అనుమతిస్తారా? లేదా? అన్నది యూఏఈ ప్రభుత్వం చేతుల్లో ఉంది.

ప్రస్తుత పరిస్థితుల్లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కాసింత సేఫే అనిపిస్తోంది. కారణం కరోనా కేసులు తగ్గడం. రోజుకు మహా అయితే మూడు వందలకు మించి పాజిటివ్‌ కేసులు నమోదు కావడం లేదక్కడ. మొన్నటి వరకు అక్కడ 37 వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి.. ఈ లెక్కలన్నీ చూస్తే యూఏఈలో ఐపీఎల్‌ నిర్వహించాలనుకోవడం మంచి నిర్ణయమే అనిపిస్తోంది. ఈ నెల ఏడు నుంచి పర్యాటకుల కోసం తలుపులు తెరిచింది అక్కడి ప్రభుత్వం. కోవిడ్‌-19 పరీక్షలో నెగటివ్‌ వచ్చిన వారికి 15 రోజుల క్వారంటైన్‌ అక్కడ అవసరం లేదు కూడా! విదేశాల నుంచి వచ్చే వారు తమకు పాజిటివ్‌ లేదని నిరూపించుకుంటే చాలు… ఎక్కడైనా తిరగొచ్చు. ఆగస్టు చివరివారంలో కల్లా ఆటగాళ్లు దుబాయ్‌లో ఉండేలా ఫ్రాంచైజ్‌లు ఏర్పాట్లు చేస్తున్నాయి…ముఖ్యంగా భారత ఆటగాళ్లకు నెల రోజుల ట్రైనింగ్‌ అవసరం.. ఎందుకంటే మార్చి నుంచి వారు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.. ఇంత సుదీర్ఘమైన గ్యాప్‌ ఎప్పుడూ రాలేదు. మిగతా దేశాల ఆటగాళ్లకు కూడా యుఏఈలో ఐపీఎల్‌ జరగడం పట్ల పెద్దగా అభ్యంతరాలేమీ లేవు.. మొత్తంమీద యూఏఈలో జరిగే ఐపీఎల్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..