‘వార్నింగ్.. పేలుడు పదార్ధం రెడీ..’

IPL 2020: లేట్‌‌‌‌గా వచ్చినా లేటెస్ట్‌‌‌‌గా వచ్చినట్టు… ఐపీఎల్ 2020 ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు లీగ్‌లో జరిగినవి 10 మ్యాచ్‌లే అయినా.. ప్రతీ మ్యాచ్‌ చివరి బాల్ వరకు రసవత్తరంగా సాగింది. ఇక ఈరోజు అబుదాబీ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలబడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ ఫ్యాన్స్ తమ ఫేవరెట్ టీమ్ ఈ టోర్నమెంట్‌లో బోణీ కొట్టాలని.. వార్నర్ చెలరేగితే చూడాలని అనుకుంటున్నారు. ఇప్పటివరకు […]

'వార్నింగ్.. పేలుడు పదార్ధం రెడీ..'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 29, 2020 | 2:16 PM

IPL 2020: లేట్‌‌‌‌గా వచ్చినా లేటెస్ట్‌‌‌‌గా వచ్చినట్టు… ఐపీఎల్ 2020 ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు లీగ్‌లో జరిగినవి 10 మ్యాచ్‌లే అయినా.. ప్రతీ మ్యాచ్‌ చివరి బాల్ వరకు రసవత్తరంగా సాగింది. ఇక ఈరోజు అబుదాబీ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలబడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ముఖ్యంగా సన్‌రైజర్స్ ఫ్యాన్స్ తమ ఫేవరెట్ టీమ్ ఈ టోర్నమెంట్‌లో బోణీ కొట్టాలని.. వార్నర్ చెలరేగితే చూడాలని అనుకుంటున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అందుకే ఈ మ్యాచ్‌లో వార్నర్ భాయ్ బ్యాట్ ఝుళిపిస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మ్యాచ్ కోసం వార్నర్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియోను సన్‌రైజర్స్ తమ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘వార్నింగ్.. పేలుడు పదార్ధం” అంటూ కామెంట్ చేసింది.