IPL 2020: RR Vs KXIP, సమవుజ్జీల మధ్య ఢీ అంటే ఢీ..

ఐపీఎల్ 2020లో భాగంగా ఇవాళ మరో రసవత్తర పోరుకు తెరలేవనుంది. షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య రాత్రి 7.30కి మ్యాచ్ జరగనుంది.

IPL 2020: RR Vs KXIP, సమవుజ్జీల మధ్య ఢీ అంటే ఢీ..
Follow us

|

Updated on: Sep 27, 2020 | 11:06 AM

ఐపీఎల్ 2020లో భాగంగా ఇవాళ మరో రసవత్తర పోరుకు తెరలేవనుంది. షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య రాత్రి 7.30కి మ్యాచ్ జరగనుంది. అండర్ డాగ్స్‌గా టోర్నీలోకి బరిలోకి దిగిన ఈ రెండు జట్లు విజయాలతో ఆరంభించి తమ జైత్రయాత్రను కొనసాగించాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. (IPL 2020)

బట్లర్ చేరికతో.. రాయల్స్‌కు మరింత బలం..

మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ స్టీవ్ స్మిత్ యాంకర్ రోల్ పోషిస్తే.. యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇక చివర్లో జోఫ్రా ఆర్చర్ సిక్సర్ల జల్లు కురిపించాడు. ఇప్పుడు వీళ్లకు జోస్ బట్లర్ కూడా తోడవ్వడం రాయల్స్‌కు మరింత బలాన్ని చేకూరుస్తోంది. టాప్ ఆర్డర్‌లో బట్లర్, స్టీవ్ స్మిత్, శాంసన్.. మిడిల్ ఆర్డర్‌లో రాబిన్ ఉతప్ప నిలబడితే మరోసారి పరుగుల ప్రవాహం ఖాయం.

మరోసారి రాహుల్ దంచికొడితే..

రాయల్స్ మాదిరిగా పంజాబ్ జట్టుకు కూడా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఓపెనర్ కెఎల్ రాహుల్‌తో పాటు మయాంక్ అగర్వాల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ ఆదరగొడుతుండగా.. మయాంక్ ప్రతీ మ్యాచ్‌లోనూ చక్కటి ఆరంభాన్ని ఇస్తున్నాడు. రాయల్స్‌ మ్యాచ్‌లో రాహుల్ నుంచి మరో భారీ ఇన్నింగ్స్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. పూరన్ కూడా తిరిగి ఫామ్‌లోకి వస్తాడని పంజాబ్ జట్టు భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో గేల్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బౌలింగ్‌లో ఎవరిది పైచేయి.?

షమీ, కాట్రెల్‌తో పంజాబ్ పేస్ బలంగా ఉండగా.. రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్, మాక్స్‌వెల్‌తో స్పిన్ విభాగం కూడా అద్భుతంగా ఉంది. ఇక రాజస్థాన్ పేస్ విభాగంలో జోఫ్రా ఆర్చర్ ఆదరగోడుతున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేస్తున్నాడు. ఉనద్కట్, టామ్ కరన్ కూడా ఫామ్‌లోకి వస్తే రాయల్స్‌కు కలిసొచ్చే అంశం.

Also Read:

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు.!

బ్రూసెల్లోసిస్‌… తస్మాత్ జాగ్రత్త.!

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!

సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..

ఏపీలో తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరిగిన కరోనా కేసులు..!