బెన్‌స్టోక్స్‌ సెంచరీ..రాజస్థాన్‌ అద్బుత విజయం

అబుదాబి వేదికగా ఐపీఎల్‌-2020లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు రాజస్థాన్ భారీ  షాక్ ఇచ్చింది‌.

  • Ram Naramaneni
  • Publish Date - 11:43 pm, Sun, 25 October 20

అబుదాబి వేదికగా ఐపీఎల్‌-2020లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు రాజస్థాన్ భారీ  షాక్ ఇచ్చింది‌. ఈ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్న ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన రాజస్థాన్‌ రాయల్స్‌ 8 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగరవేసింది. ఛేజింగ్ లో బెన్‌స్టోక్స్‌(107: 60 బంతుల్లో 14ఫోర్లు, 3సిక్సర్లు) అద్భుత శతకంతో అదరగొట్టాడు. సంజూ శాంసన్‌(54 నాటౌట్‌: 31 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకంతో రాణించడంతో 196 పరుగుల టార్గెట్ ను 18.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్టోక్స్‌, శాంసన్‌ జోడీ ఎలాంటి ఒత్తిడి లేకుండా అలవోకగా పరుగులు చేశారు. 44/2తో కష్టాల్లో ఉన్న జట్టును వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడి గొప్ప విజయాన్ని అందించారు.

అంతకుముందు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య(60 నాటౌట్‌ :21 బంతుల్లో 2ఫోర్లు, 7సిక్సర్లు) అదరగొట్టడంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 రన్స్ చేసింది. ఇషాన్‌ కిషన్‌(37), సూర్యకుమార్‌ యాదవ్‌(40), సౌరభ్‌ తివారీ(34) రాణించారు.

( శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..రేపట్నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ )