Breaking News
  • హైదరాబాద్‌: పాతబస్తీ ప్రజలు వరదల్లో బాగా నష్టపోయారు. వరదల్లో నష్టపోయిన ప్రతీ ఒక్కరికి న్యాయం చేస్తాం . 117 ఏళ్ల తర్వాత 29 సెం.మీ వర్ష పాతం నమోదైంది . 117 ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో 15వేల మంది చనిపోయారు . భవిష్యత్‌లో ఇలాంటి పరిణామాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి . సాలరే మిల్లత్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ నుంచి 33 వస్తువులను వరద బాధితులను ఇస్తున్నాం. ఇలాంటి సమయంలో విమర్శలు తగదు, అందరూ కలిసి సమస్యను పరిష్కరించాలి. ప్రభుత్వం అందించే రూ.10వేలు సాయం అభినందనీయం . ప్రభుత్వం వరద బాధితులకు మరింత సాయం అందించాలి . పార్టీ ఆదేశిస్తే బీహార్‌ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తా-అక్బరుద్దీన్‌ ఓవైసీ.
  • కూల్చివేతలు, కుట్రలు, అక్రమ అరెస్ట్‌లే లక్ష్యంగా జగన్‌ పాలన. విద్య కోసం కూడా ఇతరరాష్ట్రాలకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరోపణలు నిజమైతే నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలి. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం వికృత చేష్టలు చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. తిరుగుబాటు తప్పదు. -టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
  • నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహారంపై స్పందించిన మంత్రి కొడాలి నాని. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కొన్ని నెలలు మాత్రమే ఉంటారు. తర్వాత రిటైరై హైదరాబాద్‌లో ఉంటారు-మంత్రి కొడాలి నాని. ప్రభుత్వానికి రమేష్‌కుమార్‌ కన్నా ప్రజల శ్రేయస్సే ముఖ్యం. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఏమీ చేయలేరు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించే యోచనలో.. ప్రస్తుతం ప్రభుత్వానికి లేదు-మంత్రి కొడాలి నాని. బీహార్‌ ఎన్నికలతో స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చకూడదు-కొడాలి నాని.
  • మహబూబాబాద్‌: దీక్షిత్ కిడ్నాప్‌, హత్య కేసులో తల్లి వసంత అనుమానాలు. దీక్షిత్‌ కేసులో మంద సాగర్‌తో పాటు మరో ముగ్గురి పాత్ర కూడా ఉంది. వారి నుంచి మాకు, మా చిన్న కుమారుడికి కూడా ప్రాణ హాని ఉంది. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలి.. లేదా కేసు సీబీఐకి అప్పగించాలి. నిందితులను కఠినంగా శిక్షించకపోతే మరిన్ని నేరాలు పెరుగుతాయి. -దీక్షిత్‌ తల్లి వసంత.
  • అమరావతి: కృష్ణా బోర్డు పరిధిపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు. స్పిల్‌వేలు, జలవిద్యుత్ కేంద్రాలు బోర్డు ఆధీనంలోకి తేవాలి. కాలువహెడ్ రెగ్యులేటర్లు, ఎత్తిపోతలపథకాలను బోర్డు పరిధిలోకి తేవాలి. నీటి విడుదల, నియంత్రణ అధికారులు.. బోర్డు పర్యవేక్షణలోనే విధులు నిర్వహించాలని ప్రతిపాదనలు.
  • ట్రాఫిక్‌ జరిమానాల పెంపుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై కఠినంగా ఉండాలని నిర్ణయించాం. అడ్డగోలుగా వాహనాలు నడిపేవారిపై చర్యలు తప్పవు-మంత్రి పేర్ని నాని. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. వాహనదారులు బాధ్యతాయుతంగా ఉండాలి-మంత్రి పేర్ని నాని. ఏపీ, తెలంగాణ చెక్‌పోస్టుల దగ్గర ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి తీవ్రంగా ప్రయత్నించాం-పేర్ని నాని. మంగళవారం ఒప్పందం చేసుకుంటామని టీఎస్‌ఆర్టీసీ అధికారులు చెప్పారు. జూన్‌ 18 నుంచి టీఎస్‌ అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. టీఎస్ అధికారులు ఏది చెబితే దానికి ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇంకా టీఎస్‌ అధికారులు ప్రతిపాదనలు ఇవ్వలేదు-పేర్ని నాని. మేము మొదటి నుంచి కూడా మొండిగా ప్రవర్తించలేదు. ఆర్టీసీ లాభనష్టాలను చూడడంలేదు.. ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. తెలంగాణ ఆర్టీసీకి సెలవుల కారణంగా ఒప్పందం చేసుకోలేకపోయాం.
  • గుంటూరు: తాడేపల్లిలోని రెండు ఫార్మసీ షాపుల్లో చోరీ, రూ.18 వేలు, సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లిన దుండగులు, పీఎస్‌లో ఫిర్యాదు.

ఐపీఎల్ 2020: పంజాబ్ రేసులో నిలవాలంటే.. గెలవాల్సిందే!

ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య రసవత్తరమైన పోరు జరగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

RCB Vs KXIP Match 31st Predictions, ఐపీఎల్ 2020: పంజాబ్ రేసులో నిలవాలంటే.. గెలవాల్సిందే!

ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య రసవత్తరమైన పోరు జరగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటిదాకా ఈ రెండు జట్లూ చెరో ఏడు మ్యాచ్‌లు ఆడగా.. బెంగళూరు ఐదు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానం నిలవగా.. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించి పంజాబ్ చివరి స్థానంలో నిలిచింది. ఇక రేసులో నిలవాలంటే పంజాబ్ జట్టు ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవక తప్పదు. (RCB Vs KXIP Match 31st Predictions)

రాహుల్&కో ఇప్పటిదాకా అన్ని మ్యాచ్‌ల్లోనూ అద్భుతమైన పెర్ఫార్మన్స్‌లు ఇచ్చారు. కానీ వారి బ్యాడ్ లక్ వల్ల ఏదీ కలిసి రావట్లేదు. పంజాబ్ టీంకు రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లు.. వీరిద్దరూ కూడా విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌.. ఒక్కసారిగా క్రీజులో నిలదొక్కుకుంటే పంజాబ్‌కు గెలుపు ఖాయమేనని చెప్పాలి. అలాగే మిడిల్ ఆర్డర్‌లో నికోలస్ పూరన్ ప్రతీ మ్యాచ్‌లోనూ అదరగొడుతున్నాడు. ఈ మ్యాచ్‌కు క్రిస్ గేల్ కూడా అందుబాటులో ఉండటం పంజాబ్ బ్యాటింగ్ లైనప్‌కు మరింత బలాన్ని ఇస్తోంది. జోర్డాన్, షమీ, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌లతో బౌలింగ్ లైనప్ కూడా బలంగానే ఉంది.

అటు బెంగళూరు విషయానికి వస్తే.. ఈ జట్టు అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా కనిపిస్తోంది. ఆర్సీబీ బౌలర్లు ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. అటు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం.. పడిక్కల్, ఫించ్, డివిలియర్స్ అదరగొట్టడం బెంగళూరుకు కలిసొచ్చే అంశం. ఆల్‌రౌండర్‌గా క్రిస్ మోరిస్ తనవంతు పాత్రను పోషిస్తున్నాడు. రెండు బలమైన జట్ల మధ్య సాగే ఈరోజు మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి..

బెంగళూరు జట్టు(అంచనా): పడిక్కల్, ఫించ్, విరాట్ కోహ్లీ, డివిలియర్స్, శివమ్ దూబే, మోరిస్, ఉదానా, సుందర్, సైనీ, సిరాజ్, చాహల్

పంజాబ్ జట్టు(అంచనా): గేల్, రాహుల్, మయాంక్ అగర్వాల్, పూరన్, మాక్స్ వెల్/నీషమ్, మనదీప్ సింగ్, జోర్డాన్, షమీ, మురుగన్ అశ్విన్/ గౌతమ్, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్ సింగ్

Also Read:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. దసరా స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే.!

ఆ పాత రూపాయి నాణెంతో.. రూ. 25 లక్షలు మీ సొంతమవుతాయట!

బిగ్ బాస్ 4: ‘టాప్’ లేపుతున్న ఆ ఇద్దరు.. ఫైనల్ ఫైవ్‌లో ఎవరుంటారో.?

Related Tags