ఈసారి ఐపీఎల్‌ కప్పు గెల్చుకుని తీరతాం ః ఆర్సీబీ కెప్టెన్‌ కోహ్లీ

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు... ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత ప్రజాదరణ ఉన్న జట్లలో ఒకటి.. అయితే ఇప్పటి వరకు ట్రోఫీని అందుకున్నది లేదు! టీమ్‌లో టాలెంటెడ్‌ ప్లేయర్లకు కొదవ లేదు..

ఈసారి ఐపీఎల్‌ కప్పు గెల్చుకుని తీరతాం ః ఆర్సీబీ కెప్టెన్‌ కోహ్లీ
Follow us

|

Updated on: Sep 18, 2020 | 1:54 PM

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు… ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత ప్రజాదరణ ఉన్న జట్లలో ఒకటి.. అయితే ఇప్పటి వరకు ట్రోఫీని అందుకున్నది లేదు! టీమ్‌లో టాలెంటెడ్‌ ప్లేయర్లకు కొదవ లేదు.. అదేమిటో గ్రౌండ్‌లోకి వచ్చేసరికి ఆ టాలెంటంతా ఉష్‌కాకి అవుతున్నది.. అంత మంది స్టార్లు ఉంటే ఏం లాభం..? ఏదో ఒక డిపార్టమెంట్‌లో వెనుకంజ వేస్తూనే ఉంది.. బౌలింగ్‌లో రాణిస్తే బ్యాటింగ్‌లో ఫ్లాప్‌.. బ్యాటింగ్‌లో రాణించిన సందర్భాలలో బౌలర్లు చేతులెతేస్తున్నారు.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 973 పరుగులు చేశారన్న పేరే కానీ.. ఆ పరుగులు టైటిల్‌ను గెల్చుకోవడానికి ఉపయోగపడలేదు. 2016లో రన్నరప్‌గా నిలిచిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఆ మరుసటి ఏడాది అంటే 2017లో చిట్ట చివరి స్థానంలో నిలబడింది.. 2018కి వచ్చేసరికి కొంచెం బెటర్‌.. అంటే పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో నిలబడి కాస్త పరువు కాపాడుకుంది.. లాస్టియర్‌ మళ్లీ అదే చివరిస్థానం.. విచిత్రమేమిటంటే ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక స్కోరు రికార్డు రాయల్‌ ఛాలెంజర్స్‌ పేరిట ఉండటం.. 2013లో పూణె వారియర్స్‌పై అయిదు వికట్లకు 263 పరుగులు చేసిందీ జట్టు.. ఇప్పటి వరకు ఆ స్కోరును ఎవరూ బీట్ చేయలేదు.. ఇంకో విచిత్రమేమిటంటే అత్యల్ప స్కోరు రికార్డు కూడా బెంగళూరుదే! 2017లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై కేవలం 43 పరుగులకే కుప్పకూలిందీ జట్టు! ఇదీ ఒక రికార్డే!

ఈసారి మాత్రం కప్పు కొట్టడం గ్యారంటీ అంటున్నాడు కోహ్లీ.. గతం గతః .. ఇప్పుడు టీమ్‌ చాలా బలంగా ఉందని చెబుతున్నాడు.. ఆ జట్టులోని కీలక ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాడు.. ప్రస్తుతం టీమ్‌ చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నదని, కోహ్లీ కెప్టెన్సీలో కొండంత విశ్వాసంతో ఉందని అంటున్నాడు. వారు వీరు చెప్పడం ఎందుకు కానీ.. టీమ్‌లో అయితే భారీ మార్పులే జరిగాయి.. కోచింగ్‌ సిబ్బందిని మార్చేశారు.. క్రికెట్‌ డైరెక్టర్‌గా మైక్‌ హెసన్‌ను తీసుకున్నారు.. బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌ను బలోపేతం చేశారు.. ఆల్‌రౌండర్లకు పెద్ద పీట వేశారు. ఐపీఎల్‌లో పాల్గొంటున్న టీమ్‌లలో బెంగళూరు కాస్త గట్టిగానే కనిపిస్తున్నదీసారి.. ఫైనల్‌ ఎలెవన్‌ ఎంపికలో కోహ్లీ పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనిపిస్తోంది. పైగా ఈసారి కప్పు గెలవాలన్న పట్టుదల ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.. కసితో ప్రాక్టీస్‌ చేస్తున్నారు.. కటిచ్‌, హెసన్‌లు అద్భుతంగా శిక్షణ ఇస్తున్నారు. క్రిస్‌ గేల్ లేకపోవడంతో భారమంతా కోహ్లీ, డివిలియర్స్‌పై పడనుంది. వీరిద్దరు బ్యాటింగ్‌లో రాణిస్తే గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిధ్యం ఇచ్చిన జోష్‌ ఫిలిప్పీ వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించే అవకాశం ఉంది. డేల్‌ స్టయిన్‌, క్రిస్‌ మోరిస్‌, ఆడమ్‌ జంపా, ఇసురు ఉడానతో బెంగళూరు టీమ్‌ పటిష్టంగా కనిపిస్తుంది.. కోహ్లీ అంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు కాబట్టి టైటిల్‌ బెంగళూరు గెల్చుకుంటుందేమో చూడాలి.