రాయల్స్ రేస్‌లో నిలవాలంటే.. మిగిలిన మ్యాచ్‌లు గెలవాల్సిందే.!

ఐపీఎల్‌‌–13వ సీజన్‌ ఇంటర్వెల్ ముగిసింది. కానీ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సారధ్యం వహిస్తున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు మాత్రం అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతోంది.

రాయల్స్ రేస్‌లో నిలవాలంటే.. మిగిలిన మ్యాచ్‌లు గెలవాల్సిందే.!
Follow us

|

Updated on: Oct 17, 2020 | 8:54 PM

IPL 2020: ఐపీఎల్‌‌–13వ సీజన్‌ ఇంటర్వెల్ ముగిసింది. కానీ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సారధ్యం వహిస్తున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు మాత్రం అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతోంది. లీగ్‌లో ఈ ఫ్రాంచైజీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఇప్పటిదాకా ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో కేవలం మూడింటిలోనే విజయం సాధించి.. టోర్నీలో నిలవాలంటే.. మిగిలిన అన్ని మ్యాచులు తప్పక గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది.

రాజస్థాన్ రాయల్స్ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్, బెన్ స్టోక్స్ లాంటి మేటి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. అలాగే రాబిన్ ఉతప్ప, రియాన్ పరాగ్, మనన్ వోహ్రా, జైస్వాల్, సంజూ శాంసన్, లోమరోర్, తేవాటియాలతో ఇండియన్ టాలెంట్‌ కూడా పుష్కలంగా ఉంది. ఇక బౌలింగ్ లైనప్ చూసుకుంటే ఆర్చర్, కరన్, టై, మకరందే, థామస్‌లతో బలంగా ఉంది. ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నా ఈ జట్టు వరుసగా విఫలం కావడానికి కారణాలు లేకపోలేదు.

ఈ సీజన్‌లో స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా చాలా చెత్త డెసిషన్స్ తీసుకున్నాడని చెప్పాలి. మొదటి మ్యాచుల్లో ఓపెనర్ అయిన ఉతప్పను మిడిల్ ఆర్డర్‌లో దింపడం.. అలాగే ఫినిషర్ అయిన బెన్ స్టోక్స్‌ను ఓపెనర్‌గా వినియోగించుకోవడం.. స్మిత్ తప్పుడు నిర్ణయాలకు అడ్డం పడుతున్నాయి. మనన్ వోహ్రా, మయాంక్ మకరందే, డేవిడ్ మిల్లర్ లాంటి ఆటగాళ్ల టాలెంట్‌ను కూడా సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు.

అలాగే కొద్దిసేపటి క్రితం రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోవడానికి 19వ ఓవర్ బెస్ట్ బౌలర్‌కు ఇవ్వాల్సిన స్టీవ్ స్మిత్.. అనుభవం లేని ఉనద్కట్‌కు ఇచ్చాడు. ఇంకా ఇలాంటి చెత్త నిర్ణయాలు స్మిత్ చాలానే తీసుకున్నాడు. మొదటి మూడు మ్యాచుల్లో స్మిత్, శాంసన్ అద్భుతంగా ఆడినా.. ఆ తర్వాత ఇరువురూ ఫామ్ కోల్పోయారు. అలాగే బట్లర్, స్టోక్స్ ఫామ్ లేమి కూడా జట్టును ఇబ్బంది పెడుతోంది. అసలు హెడ్ కోచ్ షేన్ వార్న్ స్ట్రాటజీ.. కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రణాళిక ఏంటో అర్ధం కావట్లేదు. అయితే ఇకపై రాజస్థాన్ అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిస్తేనే.. టోర్నీలో నిలుస్తుంది.