”ధోని.. నిజంగా ఓ జీనియస్”

నిజంగా ధోని ఓ జీనియస్.. తన ప్లానింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. 18వ ఓవర్‌లో అతడు నా దగ్గరకి వచ్చి.. రిస్క్ తీసుకో.. నీ శైలిలో నువ్వు ఆడు..

''ధోని.. నిజంగా ఓ జీనియస్''
Follow us

|

Updated on: Sep 20, 2020 | 3:14 PM

శనివారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌తో ఐపీఎల్ 2020 సీజన్ యూఏఈ వేదికగా ప్రారంభమైంది. ముంబై విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని చెన్నై బ్యాట్స్‌మెన్లు అంబటి రాయుడు, డుప్లెసిస్‌లు ఆడుతూ పాడుతూ కొట్టేశారు. ఈ మ్యాచ్‌లో రాయుడు, డుప్లెసిస్‌, స్యామ్‌ కరన్‌లు కీలక పాత్రలు పోషించారని చెప్పాలి. బ్యాటింగ్ సమయంలో చెన్నై కెప్టెన్ ధోని.. జడేజా, స్యామ్‌ కరన్‌లను తనకంటే ముందు పంపించాడు. ఇక వీరిద్దరూ కూడా కెప్టెన్ నమ్మకాన్ని వొమ్ము చేయకుండా అద్భుతంగా ఆడారు.

22 ఏళ్ల స్యామ్‌ కరన్‌ ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్‌లో తక్కువ పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టిన కరన్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో 6 బంతుల్లోనే 18 పరుగులు చేసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. అటు మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలో కరన్.. ధోనిపై ప్రశంసలు కురిపించాడు. (Dhoni really a genius Says Sam Curran)

”బ్యాటింగ్ ఆర్డర్‌లో ధోని.. నన్ను ముందు పంపించడం చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. జడేజాతో పాటు వెళ్ళాలి రెడీగా ఉండన్నప్పుడు.. గ్రౌండ్‌లోకి ‘సిక్స్ లేదా ఔట్’ అనే మెంటాలిటీతోనే వెళ్ళాను. బౌలర్లపై డామినేట్ చేయాలని డిసైడ్ అయ్యాను” అని కరన్ తెలిపాడు. నిజంగా ధోని ఓ జీనియస్.. తన ప్లానింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. 18వ ఓవర్‌లో అతడు నా దగ్గరకి వచ్చి.. రిస్క్ తీసుకో.. నీ శైలిలో నువ్వు ఆడు.. అని చెప్పాడు. ఇక కృనాల్ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాది జట్టును గెలిపించడం చాలా సంతోషంగా ఉందని కరన్ స్పష్టం చేశాడు. కాగా, మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ”జడేజా, కరన్‌లు ఇద్దరూ ఆల్‌రౌండర్స్‌, స్పిన్నర్స్ బౌలింగ్‌లో హిట్టింగ్ ఆడే అవకాశం ఉండొచ్చని ప్రమోషన్ ఇచ్చానని తెలిపాడు.

Also Read:

మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??