ఐపీఎల్ ప్రీ క్లయిమాక్స్‌ అదిపోయింది! ప్లే ఆఫ్స్‌ సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది…

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఆతిథ్యమిస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ టోర్నమెంట్‌ హిచ్‌కాక్‌ మూవీని తలపిస్తోంది.. దాదాపుగా క్లయిమాక్స్‌కు చేరుకున్నప్పటికీ ఇంకా ప్లే ఆఫ్స్‌ టీమ్స్‌ కన్‌ఫామ్‌ కాకపోవడం ఆశ్చర్యమే!

ఐపీఎల్ ప్రీ క్లయిమాక్స్‌ అదిపోయింది! ప్లే ఆఫ్స్‌  సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది...
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 02, 2020 | 1:43 PM

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఆతిథ్యమిస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ టోర్నమెంట్‌ హిచ్‌కాక్‌ మూవీని తలపిస్తోంది.. దాదాపుగా క్లయిమాక్స్‌కు చేరుకున్నప్పటికీ ఇంకా ప్లే ఆఫ్స్‌ టీమ్స్‌ కన్‌ఫామ్‌ కాకపోవడం ఆశ్చర్యమే! ఒక్క ముంబాయి ఇండియన్స్‌ టీమ్‌ మాత్రమే అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.. లీగ్‌ దశలో ఇంకా రెండంటే రెండు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి.. ఈ రెండు మ్యాచ్‌లు ముగిస్తే కానీ టాప్‌ ఫోర్‌లో నిలిచే జట్లు ఏమిటన్నవి తెలియవు.. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు పోటీపడుతుంది.. రేపు ముంబాయి ఇండియన్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తలపడుతుంది. వీటితో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్‌ టీమ్‌ కూడా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడానికి ఉవ్విళూరుతోంది.. అయితే ఆ జట్టు అదృష్టం ఇవాళ, రేపు జరిగే మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంది.. ఇవాళ జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విజయం సాధిస్తే డైరెక్ట్‌గా ప్లే ఆఫ్స్‌లోకి వెళ్లిపోతోంది.. పైగా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంటుంది.. ఓడిపోతే మాత్రం టోర్నీ నుంచి దాదాపుగా తప్పుకోవలసి వస్తుంది. దాదాపుగా ఎందుకనాల్సి వస్తుందంటే రన్‌రేట్‌ కలిసిరావచ్చు.. కోల్‌కతా కంటే మెరుగైన రన్‌రేట్‌తో ఢిల్లీ చేతిలో ఓడిపోతే ఫర్వాలేదు.. అంటే విరాట్‌ కోహ్లీ టీమ్‌ 21 రన్స్‌ కంటే ఎక్కువ తేడాతో ఓడిపోవద్దు.. ఒకవేళ ముందు బ్యాటింగ్‌ చేస్తే మాత్రం లక్ష ఛేదనలో ఢిల్లీని కట్టడి చేయాల్సి ఉంటుంది.. అంటే ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎట్టి పరిస్థితులలో 14 బాల్స్‌ కంటే ముందు టార్గెట్‌ను రీచ్‌ కానివ్వకూడదు.. ఇది జరగకపోయినా బెంగళూరు టీమ్‌కు మరో ఆప్షన్‌ ఉంది.. అదేమిటంటే ముంబాయి చేతిలో హైదరాబాద్‌ ఓడిపోవాలి.. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ విషయానికి వస్తే గత నాలుగు మ్యాచ్‌లలో పరాజయం పాలైన ఢిల్లీ ఇవాళ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలిచి తీరాలి.. గెలిస్తే డైరెక్ట్‌గా సెకండ్‌ ప్లేస్‌లోకి వెళ్లిపోతుంది.. ఓడిపోతే మాత్రం ప్రమాదమే! ప్లే ఆఫ్స్‌ ఛాన్సెస్‌ సన్నగిల్లుతాయి.. బెంగళూరు చేతిలో ఓడిపోయినా 17 రన్స్‌ తేడా దాటనివ్వకూడదు.. ఒకవేళ మొదట బ్యాటింగ్‌ చేస్తే బెంగళూరును 11 బాల్స్‌ కంటే ముందు టార్గెట్‌ను రీచ్‌ కానివ్వకూడదు.. ఒక రేపు జరగబోయే మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓడిపోతే మాత్రం బెంగళూరు, ఢిల్లీ టీమ్స్‌ నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయి.. కోల్‌కతా కూడా ఆశగా ఉంది.. నిన్న రాజస్తాన్‌తో సాధించిన గెలుపుతో కోల్‌కతా ఆశలు సజీవంగా ఉన్నాయి.. ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లను ఆడేసిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ టీమ్‌ 14 పాయింట్లను సాధించింది.. బెంగళూరు, ఢిల్లీతో సమంగా నిలిచింది.. రేపు హైదరాబాద్‌ ఓడిపోతే మాత్రం కోల్‌కతా నాలుగో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ విషయానికి వస్తే రేపటి మ్యాచ్‌లో ముంబాయి జట్టును ఎలాగైనా ఓడించాలి.. అంతకు మించి మరో మార్గం లేదు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే హైదరాబాద్‌ నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.. ఎందుకంటే హైదరాబాద్‌ నెట్ రన్‌రేట్‌ అమోఘంగా ఉంది.. మరోవైపు ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు టీమ్‌లు నెగెటివ్‌ రన్‌రేట్‌తో ఉన్నాయి.