దంచికొట్టిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్.. ఢిల్లీ టార్గెట్ 195

అబుదాబీ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లకు కోల్‌కతా బ్యాట్స్‌మెన్ చుక్కలు చూపించారు. నితీష్ రానా(81), సునీల్ నరైన్(64)

  • Ravi Kiran
  • Publish Date - 5:30 pm, Sat, 24 October 20
IPL 2020

IPL 2020: అబుదాబీ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లకు కోల్‌కతా బ్యాట్స్‌మెన్ చుక్కలు చూపించారు. ముఖ్యంగా నితీష్ రానా(81), సునీల్ నరైన్(64) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దీనితో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. మొదట్లో నితీష్ రానా నెమ్మదిగా స్ట్రోక్ ప్లే చేసినా.. నరైన్ కలయికతో విజృంభించాడు. స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌ను టార్గెట్ చేసి ఇరువురూ బౌండరీల వర్షం కురిపించారు. ఇక ఢిల్లీ బౌలర్లలో స్టోయినిస్, రబడా, నోర్తజే రెండేసి వికెట్లు పడగొట్టారు.