ఐపీఎల్ 2020: ఈసారి తొలి పంచ్ ఎవరిది.!

కరోనా విరామం తర్వాత యూఏఈ వేదికగా ఈ నెల 19 నుంచి ఐపీఎల్ 2020 ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో ఫైనల్ మ్యాచ్ నవంబర్ 10న జరుగుతుంది. అబుదాబీ, దుబాయ్, షార్జా వేదికలుగా మ్యాచులు నిర్వహిస్తారు.

ఐపీఎల్ 2020: ఈసారి తొలి పంచ్ ఎవరిది.!
Follow us

|

Updated on: Sep 17, 2020 | 1:40 PM

కరోనా విరామం తర్వాత యూఏఈ వేదికగా ఈ నెల 19 నుంచి ఐపీఎల్ 2020 ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో ఫైనల్ మ్యాచ్ నవంబర్ 10న జరుగుతుంది. అబుదాబీ, దుబాయ్, షార్జా వేదికలుగా మ్యాచులు నిర్వహిస్తారు. ఇక తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. ముంబయి ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. చూద్దాం మరి ఈ రెండు జట్లలో ఎవరు మొదట బోణీ కొడతారో!

చెన్నైకి అదే పెద్ద బలం…

చూడ్డానికి జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరూ సీనియర్లు అయినా.. చెన్నై బలమైన జట్టే. అందుకు ముఖ్య కారణం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. తాజాగా అతడు ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సీజన్‌లో విజృంభిస్తాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక అతడితో పాటు వాట్సన్‌, డుప్లెసిస్‌, రాయుడుల బ్యాటింగ్‌ చెన్నైకి కీలకం. మరోవైపు చెన్నైకి అతి పెద్ద బలం బౌలింగ్. తాహిర్, జడేజా, శాంట్నర్, పియూష్ చావ్లాలతో చెన్నై స్పిన్‌ విభాగం అత్యంత బలంగా కనిపిస్తుంది. ఇకపోతే పేసర్‌ దీపర్‌ చాహర్‌, బ్రావో, సామ్ కుర్రాన్, ఎంగిడి, హజేల్‌వుడ్‌లతో పేస్ విభాగం అద్భుతంగా ఉందని చెప్పాలి. ( IPL 2020)

ఆత్మవిశ్వాసంతో ముంబై…

చెన్నై మాదిరిగానే ముంబై టీం కూడా బలమైనదే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమవుజ్జీలు. అంతేకాదు గతంలో చెన్నై జట్టును ముంబై చాలాసార్లు ఓడించడం జరిగింది. ఇక ఆ ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగనుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, హార్దిక్ పాండ్యా, క్రిస్ లిన్, సుర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, పొలార్డ్‌లతో ముంబై బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్‌లోనూ.. ఇటు బౌలింగ్‌లోనూ రాణిస్తే ముంబయికి తిరుగుండదని చెప్పాలి.

మలింగా జట్టుకు దూరమైనా.. స్టార్ బౌలర్ బుమ్రాతో పాటు ట్రెంట్ బోల్ట్, పాండ్యా సోదరులు, పాటిన్సన్, మెక్‌లెగాన్‌, కౌంటర్నైల్, రాహుల్‌ చాహర్‌లతో కూడిన పదునైన బౌలింగ్‌ ముంబై జట్టు సొంతం. ముఖ్యంగా బుమ్రా డెత్ ఓవర్లలో కీలక వికెట్లు పడగొడుతూ ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. ఇంత బలమైన జట్టు ఉన్నా.. చెన్నైతో పోరు అంత ఈజీ కాదని ముంబైకి తెలుసు అందుకే ముందుగానే ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. చూద్దాం మరి ఏ జట్టు మొదటి బోణీ కొడుతుందో.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..