మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌, బెంగళూరు మధ్య రసవత్తరమైన పోరు

ఇవాళ సాయంకాలం క్రికెట్‌ అభిమానులకు పండగే! టీవీల ముందు సందడే! కారణం ఐపీఎల్‌లో సర్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడబోతున్నది కాబట్టి! రెండూ జట్లు దేనికి తీసిపోవు.

మరికొద్ది గంటల్లో  హైదరాబాద్‌,  బెంగళూరు మధ్య రసవత్తరమైన పోరు
Follow us

|

Updated on: Sep 21, 2020 | 1:33 PM

ఇవాళ సాయంకాలం క్రికెట్‌ అభిమానులకు పండగే! టీవీల ముందు సందడే! కారణం ఐపీఎల్‌లో సర్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడబోతున్నది కాబట్టి! రెండూ జట్లు దేనికి తీసిపోవు. రెండు బలమైన జట్లే! గెలుపు డేవిడ్‌ వార్నర్‌ టీమ్‌దా? లేక విరాట్‌ కోహ్లీ జట్టుదా? అన్నది చెప్పడం కష్టమే! దుబాయ్‌లోని దుబాయ్‌ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ హోరాహోరీగా సాగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.. విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు బలంగానే ఉంది.. ఇంతకు ముందు కూడా బలంగానే ఉండింది.. ఇప్పటివరకు టైటిల్‌ ఎందుకు గెల్చుకోలేకపోయిందన్నది ఆశ్చర్యమే! ఈసారి కప్పు గెలవడం గ్యారంటీ అని కోహ్లీ అండ్‌ కో చెబుతున్నది కాబట్టి ఈసారి మరింత ఎఫర్ట్‌ పెట్టే అవకాశం ఉంది. అలాగని హైదరాబాద్‌ టీమ్‌ను తీసిపారేయ్యడానికేమీ లేదు.. కాకపోతే జట్టు కూర్పే సమస్యగా మారింది.. ఫైనల్‌ ఎలెవన్‌ ఎంపిక కెప్టెన్‌కు భారంగా మారే అవకాశం ఉంది.. ఓపెనర్లు ఇద్దరు విదేశీ ఆటగాళ్లే.. రషీద్‌ఖాన్‌ను పక్కన పెట్టే సీన్‌ లేదు.. ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ నబీ మంచి ఫామ్‌లో ఉన్నాడు.. కాబట్టి ఈ నాలుగురిని తీసుకోక తప్పని పరిస్థితి. అయితే మాజీ కెప్టెన్‌ విలియమ్‌సన్‌కు ఫైనల్‌ ఎలెవన్‌లో చోటు దక్కదా? విలియమ్‌సన్‌ను తీసుకుంటే నబీని కూర్చోబెట్టాల్సి వస్తుంది.. ఏం చేస్తారో చూడాలి.. బెంగళూరు జట్టుదీ ఇదే పరిస్థితి.. డివిల్లియర్స్‌ టీమ్‌లో కచ్చితంగా ఉండాల్సిన ఆటగాడు.. మొయిన్‌ ఆలీ, ఆరోన్‌ ఫించ్‌లు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు.. సో.. వీరికి కూడా పక్కన పెట్టే అవకాశం లేదు.. అలాంటప్పుడు పేస్‌ బౌలర్లయిన క్రిస్‌ మోరిస్‌, డేల్‌ స్టెయిన్‌లలో ఎవరో ఒకరికే తుది జట్టులో స్థానం ఉంటుంది.. మరి కోహ్లీ ఎవరికి ఓటేస్తాడన్నది ఆసక్తిగా మారింది.. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 15 సార్లు పోటీపడ్డాయి. ఇందులో హైదరాబాద్‌ ఎనిమిది మ్యాచుల్లో విజయం సాధించింది.. బెంగళూరు ఆరు మ్యాచ్‌లలో గెలుపొందింది. బెంగళూరు టీమ్‌ : విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఆరోన్ ఫింఛ్, యుజ్వేందర్ ఛహల్, డేల్ స్టెయిన్, ఆడమ్ జంపా, క్రిస్ మోరీస్, దేవదత్ పడిక్కల్, గుర్కీరత్ సింగ్ మన్, ఇసురు ఉడాన, జోష్ ఫిలిప్పే, మొయిన్ అలీ, మొహమ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, పార్థీవ్ పటేల్, పవన్ దేశ్ పాండే, పవన్ నేగి, శహబాజ్ అహ్మద్, శివ్ దూబే, ఉమేష్ యాదవ్, వాషింగ్టన్.

హైదరాబాద్ టీమ్‌ : డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, మనీష్ పాండే, అబ్దుల్లా సమద్, అభిషేక్ శర్మ, బసిల్ తంపి, బవనక సందీప్, బిల్లీ స్నన్లేక్, ఫబియన్ అలెన్, జానీ బైర్ స్టో, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, మొహమ్మద్ నబీ, ప్రియం గార్గ్, సందీప్ శర్మ, సంజయ్ యాదవ్.

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్