ఐపీఎల్ 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా నేడు అబుదాబీ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ తలబడుతున్నాయి.

  • Ravi Kiran
  • Publish Date - 7:11 pm, Wed, 21 October 20

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా నేడు అబుదాబీ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ తలబడుతున్నాయి. RCB ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడగా.. ఆరు మ్యాచుల్లో గెలిచి.. మూడింటిలో ఓటమి పాలైంది. ఓపెనర్లు ఫించ్, పడిక్కల్ ప్రతీ మ్యాచ్‌లోనూ రాణిస్తున్నా.. మిడిల్ ఓవర్లలో స్లో స్కోరింగ్ ఆ జట్టును ఇబ్బంది పెడుతోంది.

అటు కేకేఆర్ టీం ఇప్పటిదాకా ఐదు మ్యాచ్‌లు గెలిచి.. నాలుగింటిలో ఓడిపోయింది. ఈ టీం మిడిల్ ఆర్డర్ కూడా సరిగ్గా రాణించకపోవడం, రసెల్ మెరుపులు.. ఓపెనర్లు స్లో స్టార్ట్.. ఈ జట్టును ఇబ్బంది పెడుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా రెండు మార్పులతో బరిలోకి దిగుతుండగా.. బెంగళూరు ఒక్క మార్పు చేసింది.

బెంగళూరు: పడిక్కల్, ఫించ్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), డివిలియర్స్, గురుకీరత్ సింగ్ మనన్, వాషింగ్టన్ సుందర్, మోరిస్, సిరాజ్, ఉదానా, నవదీప్ సైనీ, చాహల్

కోల్‌కతా: రాహుల్ త్రిపాఠి, గిల్, నితీష్ రానా, దినేష్ కార్తీక్, మోర్గాన్(కెప్టెన్), టామ్ బాంటన్, కమిన్స్, ఫెర్గుసన్, కులదీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి