తొడ కండరాల్లో గ్రేడ్‌-1 చీలిక, మరికొన్ని మ్యాచ్​లకు‌ పంత్​ దూరం

మంచి ఫామ్‌లో ఉన్న ఢిల్లీకి ఎదురుదెబ్బ తగిలింది. వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ గాయం తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తొడ కండరాల్లో గ్రేడ్‌-1 చీలిక, మరికొన్ని మ్యాచ్​లకు‌ పంత్​ దూరం
Follow us

|

Updated on: Oct 14, 2020 | 7:49 AM

మంచి ఫామ్‌లో ఉన్న ఢిల్లీకి ఎదురుదెబ్బ తగిలింది. వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ గాయం తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొడ కండరాల నొప్పితో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు అనూహ్యంగా దూరమైన పంత్‌ది తీవ్రమైన గాయమేనని సమాచారం. పంత్‌ బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కలిగిన ప్లేయర్ కావడం వల్ల అతడి గాయానికి సంబంధించిన స్కాన్‌ రిపోర్టులను ఢిల్లీ.. బీసీసీఐకి పంపింది. ‘అతడికి తొడ కండరాల్లో గ్రేడ్‌-1 చీలిక ఏర్పడింది’ అని బీసీసీఐ వర్గాలు వివరించాయి. ( Alert : ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ )

పంత్‌ దూరం కావడం వల్ల ఢిల్లీ చివరి మ్యాచ్‌లో అలెక్స్‌ కేరీని కీపర్‌గా జట్టులోకి తీసుకుంది. దీంతో జట్టు సమతౌల్యం దెబ్బతింది. హెట్‌మైయర్‌ను డగౌట్‌కు పరిమితం చేయాల్సి వచ్చింది. జట్టులో హెట్‌మైయర్, రబాడ, నార్జే, స్టాయినిస్‌లను ఆడించేందుకు వీలుగా.. లలిత్‌ యాదవ్‌కు వికెట్‌కీపింగ్‌ బాధ్యతలు అప్పగించాలని ఢిల్లీ భావిస్తోంది. నిలకడ ప్రదర్శించనప్పటికీ.. ఈ టోర్నమెంట్‌లో రిషభ్ పంత్ భారీ షాట్లను ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో 176 రన్స్ చేశాడు. 38 అతని వ్యక్తిగత టాప్ స్కోర్. 133 స్ట్రైక్ రేట్‌తో 35.20 బ్యాటింగ్ యావరేజ్‌తో ఓ మాదిరిగా నెట్టుకొస్తున్నాడు. ( మరో రెండు, మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో అతి భారీవర్షాలు ! )