బ్యాట్‌తో అదరగొట్టిన కమిన్స్.. ముంబై టార్గెట్ 149

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా 149 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ప్యాట్ కమిన్స్(53), కెప్టెన్ మోర్గాన్(39) రాణించడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఈ మ్యాచ్‌లో మోర్గాన్ టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా ఇన్నింగ్స్‌ స్లోగా ప్రారంభమైంది. ముంబై బౌలర్ల దాటికి 61 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే ఓ ఎండ్ నుంచి కెప్టెన్ మోర్గాన్(39), ప్యాట్ కమిన్స్(53)తో కలిసి […]

బ్యాట్‌తో అదరగొట్టిన కమిన్స్.. ముంబై టార్గెట్ 149
Follow us

|

Updated on: Oct 16, 2020 | 9:29 PM

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా 149 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ప్యాట్ కమిన్స్(53), కెప్టెన్ మోర్గాన్(39) రాణించడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఈ మ్యాచ్‌లో మోర్గాన్ టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

కోల్‌కతా ఇన్నింగ్స్‌ స్లోగా ప్రారంభమైంది. ముంబై బౌలర్ల దాటికి 61 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే ఓ ఎండ్ నుంచి కెప్టెన్ మోర్గాన్(39), ప్యాట్ కమిన్స్(53)తో కలిసి స్కోర్ బోర్డు కదిలించాడు. ఇక చివరి రెండు ఓవర్లలో ఈ జోడి 35 పరుగులు రాబట్టడంతో కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో చాహర్ రెండు వికెట్లు.. బోల్ట్, కౌల్టర్ నైల్, బుమ్రా చెరో వికెట్ తీశారు.