సుడి’గేల్’.. టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్కడు..

IPL 2020: అతడు బరిలోకి దిగితే బౌలర్లు బెంబేలెత్తిపోతారు. బ్యాట్ ఝుళిపిస్తే బంతి బౌండరీ దాటాల్సిందే. ఫార్మాట్ ఏదైనా కూడా అతడే ‘యూనివర్స్ బాస్’. ఇంకెవరో కాదు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్. తాజాగా గేల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 మ్యాచ్‌ల్లో 1,000 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. ఈ యూనివర్స్ బాస్ కేవలం సిక్సర్లతోనే 6 వేల పరుగులు సాధించాడంటే.. అతడి విధ్వంసం మాటల్లో వర్ణించలేం. సిక్సర్ల రికార్డులో […]

  • Ravi Kiran
  • Publish Date - 10:27 pm, Fri, 30 October 20
Windies announce Test squad, no sentimental inclusion for Chris Gayle

IPL 2020: అతడు బరిలోకి దిగితే బౌలర్లు బెంబేలెత్తిపోతారు. బ్యాట్ ఝుళిపిస్తే బంతి బౌండరీ దాటాల్సిందే. ఫార్మాట్ ఏదైనా కూడా అతడే ‘యూనివర్స్ బాస్’. ఇంకెవరో కాదు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్. తాజాగా గేల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 మ్యాచ్‌ల్లో 1,000 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. ఈ యూనివర్స్ బాస్ కేవలం సిక్సర్లతోనే 6 వేల పరుగులు సాధించాడంటే.. అతడి విధ్వంసం మాటల్లో వర్ణించలేం. సిక్సర్ల రికార్డులో గేల్‌ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక ఈ జాబితాలో కీరన్ పొలార్డ్(690) రెండో స్థానంలో ఉన్నాడు. కాగా, గేల్ కేవలం ఐపీఎల్‌లోనే 341(129 ఇన్నింగ్స్) సిక్సర్లు బాదాడు.